ప్రశాంత్ కిషోర్ కోసం జగన్ ఏం చేస్తున్నారంటే?

ప్రశాంత్ కిషోర్ సేవలను కాంగ్రెస్ మర్చిపోయింది. యూపీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం కేవలం యూపీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఎలా? పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపుకు, గోవాలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావడానికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నారు. కేవలం యూపీ ఎన్నికల ఫలితాలను చూసి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను ఫలించవనడం సరికాదంటున్నారు. అందుకోసమే ప్రశాంత్ ను తన ఎన్నికల వ్యూహకర్తగా జగన్ నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసేందుకు తెలుగు వచ్చే యువకుల కోసం జగన్ అన్వేషిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1