ప‌వ‌న్ ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో….!

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ వెరైటీ లుక్‌తో క‌నిపించ‌డ‌మే కాదు, వెరైటీ చ‌ర్య‌ల‌తో అంద‌రినీ ఆక‌ర్షించాడు. జ‌న‌సేన పార్టీ పెట్టి నాలుగేళ్లు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఎంట్రీ ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ఆయ‌న తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునే క్ర‌మంలో యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యం నుంచి దీనిని ప్రారంభిస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు కూడా. అయితే, దీనికి సంబంధించి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం నుంచి బ‌యల్దేరే ముందు జ‌రిగిన ప‌రిణామాల‌ను ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కుటుంబ స‌భ్యుల‌ను రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌ని ప‌వ‌న్.. ఇప్పుడు తాజాగా విదేశీయురాలైన త‌న భార్య‌కు ఎంట్రీ ఇచ్చారు. అనూహ్యంగా ఆమెను పార్టీ కార్యాల‌యానికి తీసుకు వ‌చ్చారు. అంతేకాదు, తెలుగు వారి సెంటిమెంట్ కార్య‌క్ర‌మాలు అన్నీ చేయించుకున్నారు.

తిలకం ఎలా దిద్దాలో….

ప‌వ‌న్ త‌న భార్య‌ అన్నా లెజినేవాతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్‌ అభిమానులు ఘన స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన అధినేతగా తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్న ఆయనకు తానే ఎదురొచ్చి హారతి ఇచ్చారు పవన్ సతీమణి. గతంలో ఇంతవరకూ ఎప్పుడు చేయని విధంగా తన భార్య చేత వీర తిలకం దిద్దించుకున్నారు. అయితే.. వీర తిలకం ఎలా దిద్దాలో అన్నాకు చేతకాకపోవటంతో.. దాన్ని ఎలా పెట్టాలో భార్యకు నేర్పారు పవన్. కుడిచేతి ఉంగరం వేలితో తిలకం దిద్దాలని చెప్పటంతో.. ఆమె ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ సమయంలో కాస్త గంభీరంగా, సైలెంట్‌గా ఉన్న ఆమె.. ఆ తర్వాత నవ్వేశారు. భార్య చేత నుదిటిన తిలకం దిద్ది.. మంగళహారతి ఇప్పించుకోవటం.. తాను ప్రయాణించే కారుకు దిష్టి తీయటం.. చేయించారు ప‌వ‌న్‌.

కొబ్బరికాయ కొట్టి….

అంతేకాదు, తాను బ‌య‌ల్దేరిన కారుకు అన్నా ఎదురు రావటం లాంటి కార్యక్రమాలతో తన సతీమణికి తానిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని పవన్ తన చెప్పకనే చెప్పేశారు. పవన్ వైవాహిక జీవితం మీద నేతలు తరచూ చేసే విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నంలో తాజాగా ఇలాంటివి చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక‌, మ‌రోప‌క్క‌, ప‌వ‌న్‌కు కూడా సెంటిమెంట్లు ఉన్నాయ‌నే వాద‌న‌ల‌కు ఈ ప‌రిణామం బ‌లాన్ని చేకూర్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోనూ పోటీ చేయాల‌ని భావిస్తున్న ప‌వ‌న్‌.. దానికి స‌న్నాహ‌కంగా నిర్వ‌హిస్తున్న యాత్ర‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు సెంటిమెంట్‌, భార్య‌కు ప్రాధాన్యం ద్వారా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. రాజ‌కీయాల‌న్నాక.. అంతేక‌దా!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*