బాబుకు ‘‘జై’’ కొట్టేదెవరు?

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న అప‌ర చాణిక్య నీతిని బ‌య‌ట‌పెట్టారు. తాను ఏం చేసినా.. ఎలాంటి ప్ర‌క‌టన చేసినా అంద‌రూ ఫాలో అవుతార‌ని న‌మ్మే బాబు.. ఈ క్ర‌మంలోనే తాజాగా “మీది ద‌క్షిణాది-మాది ద‌క్షిణాది-ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుందాం` అంటూ ఢిల్లీలో సెంటిమెంట్‌ను రాజేశారు. ప్ర‌ధానంగా పార్ల‌మెంటులో ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా అడ్డు ప‌డుతున్న‌ట్టు భావిస్తున్న త‌మిళ‌నాడు అధికార పార్టీ ఎంపీల‌ను ఆయ‌న బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే ద‌క్షిణాది సెంటిమెంటును తెర‌మీదికి తెచ్చారు.

దక్షిణాది పార్టీలు….

ద‌క్షిణాది ప్రాంతీయ పార్టీల‌న్నీ.. ఐక్యంగా పోరాటం చేసి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని బాబు సూచిస్తున్నారు. త‌ద్వారా మోడీ ప్ర‌భుత్వం ఇరుకున ప‌డుతుంద‌ని బాబు భావిస్తున్నారు. అయితే, బాబు వ్యూహానికి ద‌క్షిణాదిలోని ఎన్ని ప్రాంతీయ పార్టీలు క‌లిసి వ‌స్తాయి? ఎన్ని పార్టీలు ఆయ‌న‌కు జై కొడ‌తాయి? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాలుగా తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, మ‌హారాష్ట్ర‌, గోవా, కేర‌ళ ఉన్నాయి. వీటిలో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌, మ‌హారాష్ట్ర, గోవాల్లో బీజేపీ ప్ర‌భుత్వాలే ఉన్నాయి. ఇక‌, మిగిలిన రాష్ట్రాల్లో పెద్ద‌వి కేర‌ళ‌, తెలంగాణ, కేర‌ళ‌, పుదుచ్చేరి ఉన్నాయి. వీటిలోనూ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉంది.

కేసీఆర్ ముందుకొస్తారా?

ఇక‌, కేర‌ళ‌లో సంయుక్త ప్ర‌భుత్వం ఉంది. తెలంగాణ‌లో ఒక్క‌టే టీఆర్ ఎస్ అధికారంలో ఉంది. అయితే, చంద్ర‌బాబుతో క‌లిసి వ‌చ్చేందుకు కేసీఆర్ అ్ంత సుముఖంగా లేరు. పైకి మాత్రం క‌లిసి వ‌స్తామ‌ని చెబుతున్నా.. లోలోన మాత్రం బాబుతో చేతులు క‌ల‌ప‌డం వ‌ల్ల త‌మ ప్ర‌యోజ‌నాల‌కు గండి ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని టీఆర్ ఎస్ ఎంపీలు చెబుతున్నారు. ఇక‌, తెలంగాణ‌లో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు ఏమీలేదు. పోనీ.. ఎంఐఎం వంటి పార్టీల‌తో క‌లుద్దామ‌న్నా.. ఓవైసీలు బాబుకు ఆ అవ‌కాశం ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు.

కాంగ్రెస్ తో కలుస్తారా?

ఇక‌, క‌ర్ణాట‌క‌లో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌.. కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి ఎన్నిక‌ల్లో గెలుపొందాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు బాబుతో క‌ల‌సే ప్ర‌య‌త్నం చేయ‌దు. పోనీ బాబు వెళ్లి కాంగ్రెస్‌తో క‌లిసి కేంద్రంపై పోరాటం చేస్తే.. అప్పుడు ప‌రిస్థితి మారే అవ‌కాశం ఉంటుంది. ఇక‌, కేర‌ళ‌లో క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పాల‌న చేస్తున్నందున క‌మ్యూనిస్టులు క‌లిసివ‌చ్చే ఛాన్స్ త‌క్కువ‌. ఇక‌, ఇప్ప‌టికే క‌మ్యూనిస్టు కేంద్ర క‌మిటీ ఏపీ స‌మ‌స్య‌ల‌పై త‌మ పోరాటం త‌మ‌ద‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో బాబుతో క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. మ‌హారాష్ట్ర‌కు చెందిన శివ‌సేన‌, ఎన్సీపీలు కూడా వారి వారి ప్ర‌యోజ‌నాల‌ను బేరీజు వేసుకుంటేనే త‌ప్ప బాబుతో జై కొట్టే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ నేప‌థ్యంలోబాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. స‌క్సెస్ కావ‌డం అంత వీజీకాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అప‌ర చాణిక్యుడు ఏం చేస్తాడో చూడాలి.