బాబును కలిసిన తర్వాత రేణుక ఏమన్నారంటే?

రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే తాను అధికార టీడీపీలో చేరుతున్నానని కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈరోజు అమరావతిలో చంద్రబాబును కలిసిన అనంతరం రేణుక మీడియాతో మాట్లాడారు. అయితే రేణుక అధికారికంగా ఈరోజు చేరడంలేదు మంచి ముహూర్తం చూసుకుని చంద్రబాబు విదేశీపర్యటన అనంతరం కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ అధికారికంగా టీడీపీలో చేరతానని తెలిపారు. నదుల అనుసంధానపై ఏపీ సర్కార్ ను ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా మెచ్చుకుంటున్నారన్నారు. అభివృద్ధిని కోరుకునే వారంతా టీడీపీలో చేరాలని పిలుపు నిచ్చారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన అనుభవంతో ముందుకు తీసుకెళుతున్నారన్నారు. రేణుక వెంట వచ్చిన అనుచరులకు చంద్రబాబు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

1 Comment on బాబును కలిసిన తర్వాత రేణుక ఏమన్నారంటే?

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1