బాబు సర్కార్ చోద్యం చూడర… బాబూ….

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుల విషయంలోనే నానా పాట్లు పడుతోన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడిక సొంత విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.మరోవైపు అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు విష‍యంలో కేంద్రం అమోదం తెలపకపోవడంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 9వేల కోట్లతో 46కిలోమీటర్ల పొడవున మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే గుదిబండలా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడలలో ఇదిగో అదిగో మెట్రో రైల్ అంటూ 3 ఏళ్లుగా ఊరిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRCL) తో ఒప్పందాలు అంటూ, DPR అంటూ, రోజువారీ కార్పొరేషన్ ఖర్చులు అంటూ, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRCL) అంటూ కోట్ల ప్రజా ధనం ఖర్చు చేశారు.

ఆ ప్రాజెక్ట్ లపైన విడుదల చేసిన జీవోలు

GO RT89 11/2/2015 Rs.67,42,000(67లక్షల 42వేలు ) విజయవాడ మెట్రో DPR తయారీ కోసం.

GO RT135 25/2/2015 Rs.1,05,17,000(1కోటి 5లక్షల 17వేలు ) విశాఖపట్నం ఎమ్మార్టీఎస్ DPR తయారీ కోసం.

GO RT395 9/6/2015 Rs.89,89,000(89లక్షల 89వేలు ) విజయవాడ ఎమ్మార్టీఎస్ ట్రాఫిక్, ట్రాన్స్పోర్టేషన్, స్టేషన్ లు, నిర్మాణ వివరాలు కు సంబంధించి రిపోర్ట్ తయారీ కోసం.

GO RT773 9/12/2015 50,00,000(50లక్షలు ) అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఖర్చులకు

GO MS81 31/3/2016 2,61,95,000(2కోట్ల 61లక్షల 991వేలు ) & 19,41,000(19లక్షల 41వేలు ) విశాఖపట్నం మెట్రో రైల్ DPR తయారు చేసేందుకు

GO MS161 26/6/2016 1కోటి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఖర్చులకు

GO MS328 13/12/2016 10,5,64,000(10కోట్ల 5లక్షల 64వేలు ) విజయవాడ, విశాఖపట్నం కన్సల్టెన్సీ ఫీజు విజయవాడ, విశాఖ మెట్రో రైల్ కోసం

GO MS276 23/12/2015 5కోట్లు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కి గ్రాంట్స్ రూపం లో

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1