బావమరిదికి హ్యాండిచ్చిన చంద్రబాబు?

టీటీడీ చైర్మెన్‌ పదవి పై గంపెడు ఆశలు పెట్టుకున్న నందమూరి హరికృష్ణకు మొండి చెయ్యే అయ్యేట్లు ఉంది. టీటీడీ పదవి కోసం టీడీపీ లో చాలామంది ఆశావహులు ఉన్నా మధ్యలో హరికృష్ణ పేరు కూడా వినిపించింది. రాజ్య సభ పదవీ కాలం ముగిసిన తర్వాత తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తిగా పక్కన పెట్టేశారనే విమర్శల నేపథ్యంలో హరి కృష్ణ పేరు అడపా దడపా వినిపించేది. అయితే ‌టీటీడీ చైర్మన్ గా వ్యాపారవేత్త సీఎం రవిశంకర్ ను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లేనని శనివారం జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి జీవో విడుదల అవుతుందని చెబుతున్నారు.

మళ్లీ రాజ్యసభకు పంపుతామంటూ రాయబారం…..

రవి శంకర్‌ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బడా వ్యాపారవేత్త. ఏడాది కాలం పాటు ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారు. దీంతోపాటు 19 మంది సభ్యలతో కూడిన టీటీడీ పాలకమండలిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.బోర్డు సభ్యులుగా.. సుధా నారాయణ మూర్తి, కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రా రెడ్డి, రాఘవేంద్ర రావు, ఎమ్మెల్యే కొండబాబు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్ మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్‌ వై.వి. అనూరాధ, టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్ ఉండనున్నారు.‌మరో వైపు టీటీడీ పదవి దక్కకపోవడంపై నందమూరి హరికృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన్ను బుజ్జగించడానికి పార్టీ సీనియర్‌ నేతలను రంగంలోకి దించారు. ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి నామినేట్‌ చేస్తామని సర్ది చెబుతున్నారు. ఎన్నికలకు చాలా గడువు ఉండటంతో అప్పటి వరకు హరి కృష్ణని గుప్పెట్లో ఉంచడానికే తాత్సారం చేస్తున్నట్లు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*