బావ కళ్లల్లో ఆనందం చూడాలని….!

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో బీజేపీ కూటమికి తొలి విజయం వరించింది. నాగాలాండ్ శాసనసభ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. తొలుత అన్ని పార్టీలూ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు నిచ్చినా తర్వాత అన్ని పార్టీలకుచెందిన నేతలు నామినేషన్లు వేశారు. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ లో దాదపు 250కి పైగానే నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా అధికారపార్టీ అయిన నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీల మధ్యనే పోరు రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ కూటమికి తొలి విజయం….

అయితే నాగాలాండ్ లో నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నీఫూ రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీఫూ రియో ఉత్తర అంగామీ-2 స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధికారపార్టీ అయిన నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్ధి చుప్ ఫుయో తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో నీఫూరియో ఏకగ్రీవయంగా ఎన్నియినట్లయింది. నీఫూరియో కు చుప్ ఫుయో వరుసకు బావ అవుతారు. దీంతో అధికార పార్టీలో ఉన్నప్పటికీ సీఎం అభ్యర్థిగా ఉన్న తన బావ కోసం నామినేషన్ ఉప సంహరించుకోవడం విశేషం.

పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా….

దీంతో నీఫూ రియో ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నీఫూ రియో తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 1998లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఆయన ప్రస్తుత అధికార పార్టీ నాగా పీపుల్స్ ఫ్రంట్ లో చేరి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దాదాపు పదేళ్లపాటు ఆయన సీఎంగా పనిచేశారు. 2003 నుంచి 2013 వరకూ ఆయన నాగాలాండ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే నాగా పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్న మరో నేత జెలియాంగ్ తో వచ్చిన విభేదాల కారణంటా ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 2014 ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసిఈ పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో బీజేపీ కూటమి రెట్టించిన ఉత్సాహంతో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1