బిజెపి వ్యూహం క్రిస్టల్ క్లియర్ …!

తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు మాకొద్దు అని ఎన్నికలకు ముందే బయటకు రావాలి. అలా వచ్చాక ఏపీకి తమ పార్టీ ఏం చేసింది? ఏం చేస్తున్నది చెప్పుకునే వీలు ఏర్పడుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది ఏపీ బిజెపి. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అమిత్ షా ఏపీ రాజకీయాలను వెనుకుండి శాసిస్తున్నారు. సమీకరణాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మారుస్తూ మిత్ర ధర్మం పైకి చెబుతూ శత్రు ధర్మాన్ని లోపల అనుసరిస్తున్న వారితో ఎలా నడుచుకోవాలో తేల్చి చెప్పేస్తుంది బిజెపి అధిష్టానం. ఈ నేపథ్యంలోనే పొత్తు తెంచుకోలేని స్థితిని టిడిపికి ఏర్పడేలా బెదిరిస్తూ సాగుతున్నారు కమలనాధులు.

సోము వీర్రాజే బిజెపి అస్త్రం …

కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదిగా ముద్రపడిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పడూ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. నేరుగా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ అవినీతి, అక్రమాలు టిడిపిలో ఏ రేంజ్ లో నడుస్తున్నాయో సోము ఎక్కడికక్కడ విశ్లేషిస్తున్నారు. ఇది మింగుడు పడని తమ్ముళ్లు తీవ్రంగా మధనపడుతున్నారు. తెగేదాకా లాగినంత పని చేయడం ఇప్పుడు బిజెపి వంతు గా ఉంటే కేంద్రంతో సఖ్యంగా లేకపోతే పరిణామాలు బాగా తెలిసిన చంద్రబాబు ఆచితూచి అడుగులు వేసే పనిలో పడ్డారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దని నేతలను చంద్రబాబు ఆదేశించారు. అలాగే దిష్టి బొమ్మల దహనం వంటి కార్యక్రమాలను కూడా చేపొట్టద్దని జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం సైకిల్, కమలం పార్టీల నడుమ పొత్తు లేకుండా పోయే పరిస్థితి క్రిస్టల్ క్లియర్ గా మాత్రం తేలిపోతుంది. అయితే ఈ పరిణామం ఎప్పటిదాకా కొనసాగుతుంది ఎలాంటి స్థితికి తీసుకువెళుతుందో అన్న ఆసక్తి సర్వత్రా విస్తరిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1