బీజేపీ రాంగ్ రూట్ లో వెళ్లిందా?

తెలంగాణలో బీజేపీ ప్రారంభించిన విమోచన యాత్రకు విఘ్నాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విమోచన యాత్రకు అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. తెలంగాణ విమోచన దినాన్ని సెప్టంబరు 17న అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు టీఆర్ఎస్ సర్కార్ అంగీకరించకపోవడంతో విమోచన యాత్రను పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. యాత్రను లక్ష్మణ్ పరకాల నుంచి ప్రారంభించారు. అయితే యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలోనే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పదవి ఊడిపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్ల నైరాశ్యం ఆవరించింది. రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా వెళదామనుకున్న పార్టీ నేతలకు దత్తన్నకు జరిగిన అవమానంతో కార్యకర్తలు పెద్దగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. శుక్రవారం సాయంత్రం పరకాలలో ఈ యాత్ర ప్రారంభమైంది. అయితే అప్పటికే దత్తన్న రాజీనామా చేశారన్న వార్తలు రావడంతో పెద్దగా పార్టీ అభిమానులు కూడా హాజరు కాలేదు.

కార్యకర్తలు లేకుండానే……….

ఇక ఆదివారం కూడా మంత్రివర్గంలో దత్తన్న ప్లేస్ మరొకరికి దక్కుతుందని భావించారు. అసలు తెలంగాణ ప్రస్తావనే లేకపోవడంతో చాలా మంది బీజేపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో తెలంగాణ పార్టీ నేతలను బీజేపీ అధిష్టానం విస్మరించిందనే నిర్ణయానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు లక్ష్మణ్ కార్యక్రమానికి ముఖం చాటేశారు. ఇక సోమ, మంగళవారం గణేష్ నిమిజ్జనం ఉండటంతో తాము యాత్రలో పాల్గొనడం లేదని కొందరు నేరుగా చెప్పేశారట. గణేష్ నిమజ్జనంలో బీజేపీ నేతల హడావిడే ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే తాము విమోచన యాత్రలో పాల్గొనబోమని చెప్పడంతో లక్ష్మణ్ కొద్ది మంది నేతలతో యాత్రను కంటిన్యూ చేస్తున్నారు. అసలు యాత్ర తేదీలను నిర్ణయించడంలోనే తప్పు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద బీజేపీ యాత్రకు అడుగడుగునా విఘ్నాలే ఎదురవుతున్నాయి. ఏదో ఒక ఆటంకంతో కార్యకర్తల హాజరీ పల్చగానే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*