బ్రేకింగ్ : చిరంజీవిని దెబ్బతీసిని వారిని వదలనన్న పవన్

‘సమూల మార్పులు సాధించలేకపోవచ్చు. ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చని నమ్ముతున్నా. నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్కొక్క పార్టీ ఒక కులానికి పరిమితమైంది. బీజేపీ హిందూ మతానికి పరిమితమైంది. జాతీయ భావాలున్న పార్టీలు రావాలి. అహంకారాన్ని నాలో నుంచి తొలగించుకున్నా. సరదా కోసం పార్టీ పెట్టలేదు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే జనసేన పార్టీని పెట్టా. 2003లోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఈ విషయాన్ని అమ్మా, నాన్న, అన్నయ్యకు చెప్పా. సినిమాలు హిట్టవుతున్నా నాకు సంతోషం లేదు. యువరక్తం కొత్తగా రాజకీయాల్లోకి రావాలి. యువత, మహిళలు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే రాటుదేలి పోయి ఉండేవాళ్లు. నాఆలోచనలకు అనుగుణంగానే అభిమానులు పార్టీలోకి రావాలి. చిన్న విత్తనమే పెద్ద చెట్టవుతుంది. సత్యాగ్రాహి సినిమా మార్పు తెద్దామని తీద్దామనుకున్నా. కథ కూడా రాసుకున్నా. కాని సినిమాల వల్ల మార్పు రాదని గ్రహించా. అందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఒక దేశానికి ఒక నది సరిపోదని మహాకవి అన్నాడు. అలాగే మన దేశానికి రెండు జాతీయ పార్టీలో సరిపోవు. మరిన్ని పార్టీలు రావాలి. నాకు నేను ధైర్యంతెచ్చుకునేందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. స్పెషల్ స్టేటస్ సాధించుకునే స్థాయికి మనం రావాలి. చిరంజీవికి ద్రోహం చేసిన ప్రతిఒక్కరినీ జనసేన దెబ్బకొడుతుంది.’ ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే కొందరు కావాలనే కుట్ర చేశారని, చిరంజీవిని దెబ్బతీసిన వారినెవ్వరినీ వదలబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*