
సుప్రీంకోర్టులో అవాఛనీయ సంఘలను జరుగుతున్నాయని, సుప్రీంకోర్టు పాలన వ్యవహారాలు పద్ధతిగా జరగడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో మీడియా సమావేశంలో మాట్లాడవలసి వస్తుందని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తిని అడిగామన్నారు. అయినా ప్రయోజనం లేదన్నారు. ప్రజలకు తెలియాలనే మీడియా ముందుకు వచ్చామన్నారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలనే తాము కోరుకుంటున్నామన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై నలుగురు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టులో గత కొద్దినెలలుగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ప్రజల ముందుకొచ్చామన్నారు. తమ అభిప్రాయాలను నాలుగు నెలల ముందే చీఫ్ జస్టిస్ కు తెలిపినా ఫలితం లేదన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై నలుగురు న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. ఇది నిజంగా ఊహించని పరిణామమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వరరావు నేతృత్వంలో మొత్తం నలుగురు న్యాయమూర్తులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.జస్టిస్ చలమేశ్వర్ తో పాటు జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గొగోయ్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Leave a Reply