
కర్నూలు జిల్లా అళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ మంత్రిపైనా, ముఖ్యమంత్రిపైనా ఫైరయ్యారు. మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంలో జరిగే పాదయాత్రపై పడింది. వైసీపీ నుంచి గెలిచిని అఖిలప్రియ తన తండ్రితో సహా పార్టీ మారి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అయితే జగన్ పాదయాత్ర ఈరోజు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆళ్లగడ్డలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ జరిగిందా? అని రైతుల నుంచే జరగలేదని జవాబు చెప్పించారు.
అడుగడుగునా స్వాగతం….
జగన్ పాదయాత్ర కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగుడుగునా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డి యాత్ర ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక్క పంటకు కూడా నీరివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాజోలిబండ ప్రాజెక్టు అతీగతీ లేదని, గుండ్రావుల ప్రాజెక్టు ఏమైందో జవాబు చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని చెప్పారు. శ్రీశైలంలో నిరున్నా రాయలసీమకు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన చెందారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారని తెలిసి చంద్రబాబు ఆన్ లైన్ లో దానిని తొలగించారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద మంత్రి అఖిలప్రియ ఇలాకాలో జగన్ యాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది.
Leave a Reply