మంత్రి వర్గ విస్తరణపై మండిపడుతున్న మోడీ మిత్రులు

కేంద్రమంత్రి వర్గ విస్తరణ పై మిత్రపక్షమైన శివసేన మండిపడుతోంది. మంత్రి వర్గ విస్తరణ గురించి తమకు మాట మాత్రం కూడా చెప్పక పోవడమేంటని ప్రశ్నిస్తోంది. కొత్త కేబినెట్ లో మిత్రపక్షమైన శివసేనకు అవకాశం లభిస్తుందని భావించింది. అయితే కనీసం విస్తరణపై శివసేనను సంప్రదించనూ లేదు. కనీసం విస్తరణ కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదు. దీంతో తాము పిలవని పేరంటానికి ఎందుకు వెళ్లాలంటోంది. అందుకే మంత్రివర్గ విస్తరణకు శివసేన గైర్హాజరయింది. తాము ఎవరినీ అడుక్కోవాల్సిన పరిస్థితి లేదని చెప్పింది. తమ పరిస్థితి ఏంటో తమకు తెలుసునని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

జేడీయూ డిమాండ్లు తీర్చలేకేనా?

అలాగే జేడీయూలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నేడు జరిగిన కేబినెట్లో జేడీయూకు మూడు మంత్రి పదవులు కావాలని జేడీయూ కోరింది. అందులో రైల్వే శాఖ ప్రధానమైనది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. అయితే జేడీయూ డిమాండ్ల పట్ల మోడీ, అమిత్ షాలు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖను ఎట్టిపరిస్థితుల్లో బీజేపీకే దక్కుతుందని వారు తేల్చి చెప్పారు. అంతేకాదు జేడీయూ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశముంటుందని కూడా చెప్పడంతో ప్రస్తుత విస్తరణలో జేడీయూను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే లో అనిశ్చితి పరిస్థితి నెలకొని ఉండటంతో ఆపార్టీకి కూడా విస్తరణలో చోటు కల్పించలేదు. మరోసారి విస్తరణలో జేడీయూకు, అన్నాడీఎంకేకు అవకాశం కల్పించాలన్న యోచనలో మోడీ ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*