మట్టి అమ్మి వందల కోట్లు సంపాదించిన బెజవాడ టీడీపీ నేత

మనుషుల్ని నమ్మితే ఏముంది మట్టిని నమ్ముకుంటే నాలుగు రాళ్లొస్తాయి…. మట్టితో ఏమొస్తుందనుకునే వాళ్లకు కోట్లు సంపాదించి చూపిస్తున్నాడో నాయకుడు., కృష్ణాజిల్లాలో మూడున్నరేళ్లుగా బోలెడంత మట్టిపని జరుగుతోంది. పోలవరం కుడికాల్వ కావొచ్చు., చెరువుల తవ్వకాలు కావొచ్చు., పంట కుంటలు ఇలా మట్టితో ముడిపడి ఉన్న బోలెడు పథకాలు ఏపీలో సాగుతున్నాయి. విజయవాడ శివార్లలో ఉన్న రూరల్‌ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు మట్టితో ఏకంగా వందల కోట్లు సంపాదించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జిల్లా నేతలు ఎవరితోను పెద్దగా కలివిడిగా ఉండని ఈ నాయకుడు తన పని తాను చేసుకోపోతారని పేరుంది.

మట్టిని నమ్ముకుని……

మట్టితో వందల కోట్లు ఎలా అనుకున్న వాళ్లకు దిమ్మతిరిగే వ్యాపారం చేసి చూపించాడాయన. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి కొండలు., గ్రావెల్‌ క్వారీలు., కాల్వలు., చెరువుల తవ్వకం కోసం ఏకంగా 300లారీలను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పూడిక తీత., కాల్వల తవ్వకం వంటి పనులకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందడంతో పాటు అదే మట్టిని అమ్ముకోవడం ద్వారా రెండు విధాలుగా లబ్ది పొందినట్లు అనుచరులు చెబుతున్నారు. ఇక పెద్ద ఎత్తున జరుగుతున్న రోడ్ల విస్తరణ., అభివృద్ధి పనులు., మెరక చేయడం వంటి పనులకు ఇదే మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌ లోడింగ్‌కు రూ.2వేలు వసూలు చేయడం ద్వారా రోజుకు ఆరేడు లక్షల ఆదాయం మట్టితో సంపాదిస్తుండటంతో రాజకీయ ప్రత్యర్ధులు సైతం నోరెళ్లబెడుతున్నారట. ఇక ఇదే మట్టి అపార్ట్‌మెంట్లు., ఇళ్లకు విక్రయిస్తే లోడ్‌ ఆరేడు వేల వరకు అమ్ముతున్నారు. ఇలా మూడున్నరేళ్లలో రూ.250కోట్లకు పైగా కూడబెట్టిన ఆ నేతను చూసి ఆయన ప్రత్యర్ధులు మట్టిని నమ్ముకుంటే ఇలా బాగుపడొచ్చని తెగ బాధపడిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1