మన బంధం ధృఢమైనది

ఇద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ సోమవారం సమావేశమయ్యారు. 31 ఆసియాన్ సదస్సులో ఈ సంఘటన జరిగింది. ఇద్దరూ ప్రధానులూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మీడియాతో కూడా మాట్లాడారు. భారత్ -అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యాయయన్నారు. మా సంబంధం ధృఢమైనదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆసియా దేశాల భవిష్యత్ ప్రయోజనాలపై రెండు దేశాలూ సంయుక్తంగా పనిచేస్తాయని చెప్పారు. ట్రంప్ ను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు మోడీ.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం….

అలాగే ట్రంప్ కూడా మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీని కలుసుకున్నందుకు తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్రమోడీ ప్రధానంగా ఉగ్రవాదం నిరోధంపైనే ఎక్కువ సేపుచర్చించారు. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతా అంశాలను గురించి కూడా వీరి సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ ను కలుసుకోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1