మేం రెడీ అంటున్న శివసేన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు శివసేన ఘాటుగా సమాధానమిచ్చింది. తమతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయమని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. తాము పొత్తు కోసం ఏమీ వెంపర్లాడటం లేదని తేల్చి చెప్పింది. గత కొన్నాళ్లుగా శివసేన బీజేపీ సర్కార్ పైనా… ముఖ్యంగా ప్రధాని మోడీపైనా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మోడీని విమర్శించడంతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తెగ పొగిడేస్తున్నారు. రాహుల్ సమర్థ నాయకుడని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

త్వరలో మంత్రివర్గ విస్తరణ…..

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రెండు రోజుల క్రితం ప్రభుత్వంలో ఉంటారో లేదో? తేల్చుకోవాలని శివసేనకు సవాల్ విసిరారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ మోడీని విమర్శించడం తగదన్నారు ఫడ్నవిస్. అయితే దీనిపై శివసేన సామ్నా పత్రిక ద్వారానే తన సమాధానం తెలిపింది. పొత్తు వద్దనుకుంటే మీరే వదిలేయొచ్చుగా అని నిలదీసింది. దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనుకుంటున్నారు. ఈ సమయంలో శివసేన, బీజేపీల మాటల యుద్ధం విస్తరణపై ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే విస్తరణను అవకాశంగా తీసుకోవడానికే శివసేన బీజేపీ పై చిందులేస్తుందని చెబుతున్నారు బీజేపీ నేతలు. మొత్తం మీద శివసేన బీజేపీ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని అర్ధమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*