రాజకీయ నేతలపై సందేహాలు : పవన్

Pawan Kalyan about contesting elections

జల్లికట్టు తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా పోరాటం జరగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ జారీ అయిన నేపధ్యంలో పవన్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలన్నారు. రాజకీయ నేతలు రాజీ పడ్డా ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తారన్న నమ్మకం తనకుందని పవన్ పేర్కొన్నారు.

తమిళులు ఐకమత్యంతో తమ సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైన క్రీడ జల్లికట్టును తిరిగి పొందడం ఆనందంగా ఉందన్నారు. మెరీనా బీచ్ లో లక్షలాది మంది చేరినా చిన్న సంఘటన కూడా జరగకపోవడాన్ని ఆయన ప్రశంసించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని కోరారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలనా్నారు. అయితే తమిళ ఉద్యమం నుంచి మన రాజకీయ నేతలు ఎంత వరకూ స్ఫూర్తి పొందుతారన్న విషయంలో తనకు కొన్ని సందేహాలున్నాయన్నారు. తమిళనాడు జరిగిన ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 17231 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*