రామ్ నాధ్ కోసం స్వయంగా రంగంలోకి దిగిన మోడీ

రాష్ట్రపతి అభ్యర్ధిగా రామనాధ్ కోవింద్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన స్వయంగా విపక్ష నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో ఫోన్ చేసి మరీ మాట్లాడారు. దళిత నేత రామ్ నాధ్ కోవింద్ ను ఎంపిక చేశామని, రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రధాని మోడీ కోరినట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ స్వయంగా మాట్లాడారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా మోడీ ఫోన్లో మాట్లాడి మద్దతు కోరారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో కూడా ప్రధాని మాట్లాడారు. రామ్ నాధ్ కు మద్దతివ్వడానికి కేసీఆర్ అంగీకరించినట్లు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దాదాపుగా అందరూ ప్రధాని ఫోన్ కాల్ కు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం రామ్ నాధ్ కోవింద్ ప్రధాని మోడీని కలవనున్నారు. అయితే ఉపరాష్ట్రపతి విషయంలో ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

వరుస ట్వీట్లతో…….

1945 అక్టోబర్‌ 1న జన్మించిన రామ్‌నాథ్‌ రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. యూపీనుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా 1977 నుంచి 79 వరకు ఢిల్లీ హైకోర్టులో పనిచేశారు. 1980 నుంచి 93వరకు సుప్రీం కోర్టు న్యాయవాదిగా కేంద్ర ప్రభుత్వం తరపున పనిచేశారు. 1978లో న్యాయవాదిగా నమోదైన కోవింద్‌ ఆ వృత్తిలో బాగా రాణించారు. 1994 ఏఫ్రిల్‌లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన కోవింద్‌ 2006 మార్చి వరకు ఆ పదవిలో ఉన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎస్సీ, ఎస్టీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. హోంశా‌ఖ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. పెట్రోలియం., సహజవాయువులు కమిటీలోను పనిచేశారు. రాజ్యసభ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గాను పనిచేశారు. రామ్ నాధ్ పై ప్రశంసలు కురిపిస్తూ ప్రధాని మోడీ వరుస ట్వీట్లు చేశారు. ఆయన దళితుల అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని, రాష్ట్రపతిగా రామ్ నాధ్ ఎంతో రాణిస్తారని మోడీ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*