రాష్ట్రపతి ఎన్నికల్లో సరికొత్త రికార్డులు

15వ రాష్ట్రపతి ఎన్నిక కొత్త రికార్డులు సృష్టించబోతోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ- మిత్రపక్షాల అభ్యర్ధి రాంనాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమే….ఎన్నికల్లో గెలుపుతో దేశ అత్యున్నత పదవిని చేపట్టిన బీజేపీ అభ్యర్ధిగా రాంనాథ్‌ చరిత్ర సృష్టించబోతున్నారు. గతంలో జరిగిన 14ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. 1969లో కాంగ్రెస్‌లో చీలిక సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డి, ఇందిరాగాందీ బలపరచిన వివి.గిరి చేతిలో ఓడిపోయారు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగా అబ్దుల్‌ కలాంను గెలిపించుకుంది ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ రాజకీయ పునాదులున్న కోవింద్‌ బరిలోకి దిగారు.

రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి…..

2007లో యూపీఏ హయంలో జరిగిన ఎన్నికల్లో నాటి ఉపరాష్ట్రపతి బైరాన్‌ సింగ్‌ షెకావత్ బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగే సమయంలో చాలా వరకు కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంటూ వచ్చింది. 1977, 2002లో విపక్షంలో ఉంటే., 1997లో యునైటెడ్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉండగా ఆ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్ధికి కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. 97 ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్‌ దళితుడనే ప్రచారంతో యునైటెడ్‌ ఫ్రంట్‌ తెరపైకి తెచ్చింది. నారాయణన్‌కు వామపక్షాలు., బీజేపీ కూడా మద్దతిచ్చాయి. ఇరవయ్యేళ్ల తర్వాత మళ్లీ కులం పేరుతో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు నీలం సంజీవరెడ్డి తర్వాత ఓడిపోతున్న రెండో కాంగ్రెస్‌ అభ్యర్ధి మీరా కుమార్‌ కానున్నారు. 1969లో వివి గిరి చేతిలో సంజీవ రెడ్డి ఓడిపోగా ఇప్పుడు రాంనాథ్‌ కోవింద్‌ చేతిలో మీరా ఓటమి ఖాయమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1