రాహుల్ జాకెట్…ఎంత పని చేసింది?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసుకున్న జాకెట్ పై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మేఘాలయ పర్యటనలో రాహుల్ ఈ జాకెట్ ను ధరించారు. అయితే ఈ జాకెట్ పై కమలనాధులు తీవ్రంగా విమర్శలు చేశారు. రాహుల్ వేసుకున్న జాకెట్ అత్యం ఖరీదైనదని, దాని ఖరీదు 63 వేల రూపాయలని, బ్రిటీష్ బ్రాండ్ బర్ బెర్రీ కంపెనీ తయారు చేసిన జాకెట్ ను రాహుల్ ధరించారని బీజేపీ విమర్శించింది. గతంలో రాహుల్ ప్రధాని మోడీ సూటు, బూటు విషయంలో విమర్శలు చేసిన సంగతి తెలసిందే. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు రాహుల్ జాకెట్ పై సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు.

ప్రతి విమర్శలకు దిగిన కాంగ్రెస్….

అయితే రాహుల్ మాత్రం ఈ జాకెట్ ను అభిమానులు తనకు కానుకగా ఇచ్చారన్నారు. అయితే బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ నేతలు కొంత ఘాటుగానే స్పందించారు. రాహుల్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చారని, అయినా ఆయన సాధారణ జీవితాన్ని గడపటానికే ఇష్టపడతారని కాంగ్రెస్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. రాహుల్ గాంధీ వేసుకున్న జాకెట్ ను కూడా వివాదాస్పదం చేయడం బీజేపీ నేతలకే చెల్లిందన్నారు. ఆయన ఆ జాకెట్ కొంటున్నప్పుడు బిల్లు మీరు చూశారా? అని బీజేపీ నేతలను సిద్ధూ ప్రశ్నించారు. ఇక మరో నేత రేణుకాచౌదరి కూడా దీనిపై స్పందిస్తూ ఆ జాకెట్ 700 రూపాయలకే బజార్లో దొరుకుతుందని, కావాలంటే మీకూ పంపిస్తానని బీజేపీ నేతలపై సెటైర్ వేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*