రెండో టెస్ట్ కి కోహ్లీ కొత్త వ్యూహం …!

భారత ఉపఖండం పిచ్ లపై తిరుగులేని సత్తా చాటి చెప్పే టీం ఇండియా దక్షిణాఫ్రికా తొలిటెస్ట్ లో విజయం ముంగిట బోర్లా పడటాన్ని జీర్ణించుకోలేక పోతుంది. ముఖ్యంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై విమర్శల జడివాన ముమ్మురమైంది. కేప్ టౌన్ లో మాత్రమే రాణించే అవకాశం వున్న ఇండియన్ టీం గెలుపు అవకాశాన్ని బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యంతో 72 పరుగుల తేడాతో చేజార్చుకుని అభాసుపాలైంది. దాంతో విరాట్ సేన పై రెండో టెస్ట్ కి ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఈ అవమానాలన్నీ దిగమింగుకుని కోహ్లీ సేన రెండో టెస్ట్ కోసం సెంచూరియన్ లో పోరుకు సిద్ధమైంది.

ప్లాట్ పిచ్ లపై రాణించే వారికే చోటు …

ఇప్పుడు బ్యాట్స్ మెన్ ట్రాక్ రికార్డ్ లను పక్కన పెట్టి ఆఫ్రికా పిచ్ లను ఆకళింపు చేసుకుని రాణించే వారినే కోహ్లీ రెండో టెస్ట్ కోసం ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈసారి మ్యాచ్ లో శిఖర్ ధావన్ స్థానంలో పార్థివ్ పటేల్, రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్, అజింక్య రహానే రెండో టెస్ట్ లో అడుగు పెట్టె ఛాన్స్ లే అధికం. తొలి టెస్ట్ లో రహానే ను పక్కన పెట్టడంతో వెటరన్ క్రికెట్ తారలు కోహ్లీపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దాంతో ఇప్పుడు కోహ్లీ నయా టీం తో రెండో టెస్ట్ కి సర్వశక్తులు ఒడ్డెందుకు సిద్ధంగా వున్నాడు. ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న సెంచూరియన్ లోని పిచ్ రెండో టెస్ట్ రా రమ్మని సవాల్ విసురుతుంది. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు ఇండియన్ టీం కి అసలు సిసలు పరీక్ష మొదలౌతుంది. చూడాలి మన టీం ఇండియా రెండో టెస్ట్ లో ఏం సాధిస్తుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1