ర‌మేష్‌ సీఎంను ఎలా బుట్టలో వేశారంటే?

క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ ఎంపీ సీఎం ర‌మేష్ ఇప్పుడు సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారారు. ఆయ‌న మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే, టీడీపీలో అనేక మంది ఉద్ధండు లు ఈ సీటు కోసం కాచుకుని కూర్చున్న నేప‌థ్యంలో అనూహ్యంగా మ‌రోసారి సీఎం ర‌మేష్‌కు అవ‌కాశం ద‌క్క‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. నిజానికి సీఎం ర‌మేష్ కు రెన్యువ‌ల్ చేయ‌డం సంచ‌ల‌న‌మే.

సీనియర్లు ఉన్నప్పటికీ….

ఇప్ప‌టికే అనేక మంది సీనియ‌ర్లు ఈ టికెట్ కోసం వేచి చూస్తున్నారు. రాజ‌కీయాలు స‌హా పారిశ్రామిక వ‌ర్గాలకు చెందిన వారు సైతం ఈ సీటు కోసం ప్ర‌యాస‌ప‌డ్డారు. బాబు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు సైతం చేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ కృష్ణుడు సైతం రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే, బాబు మాత్రం సీఎం ర‌మేష్‌కు రెన్యువ‌ల్ చేసేందుకే మొగ్గు చూపారు.

జగన్ ను ఢీకొట్టారనేనా?

దీంతో ర‌మేష్‌కు రెన్యువ‌ల్ వెనుక ఉన్న రీజ‌న్ల‌పై నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. పార్టీకి అండ‌గా ఉంటూ.. పార్టీకి సేవ చేయ‌డంలో ర‌మేష్ ముందున్నాడ‌ని, అందుకే రెన్యువ‌ల్ సాధ్య‌మైంద‌నే కంక్లూజ‌న్‌కు వ‌చ్చారు. ముఖ్యంగా విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లాలో టీడీపీ విస్త‌రించేందుకు, టీడీపీకి తిరుగు లేకుండా చేసేందుకు సీఎం ర‌మేష్ శ్ర‌మించార‌ని అంటున్నారు. కడప లో గత సార్వత్రిక ఎన్నికలు స‌హా స్ధానిక సంస్థ‌ల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు భారీ ఎత్తున గెలిచేందుకు రమేష్‌ విశేష కృషి చేశారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే గుర్తించారు. ఇక‌, గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిల్లో జగన్ బాబాయి వివేకానంద రెడ్డిని ఓడించ‌డంలోను, టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవిని గెలిపిం చడంలోను సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు. దీంతో క‌డ‌ప‌లో టీడీపీ డెవ‌ల‌ప్ అయ్యేందుకు ఎంతో ఉప‌యుక్తంగా మారింది.

జగన్ ను కట్టడి చేయాలంటే….

అంతేకాదు- కడపలో జగన్‌ను కట్టడి చేయాలంటే ఇలాంటి నాయకులు పదవుల్లో ఉండటం అవసరమని చంద్రబాబు భావిస్తున్నార‌ని స‌మాచారం. ముఖ్యంగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం, గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకోవడం, అన్నిటిక‌న్నా ముఖ్యంగా.. జ‌గ‌న్‌ను త‌న సొంత జిల్లాలోనే దెబ్బ‌కొట్టాల‌ని ఇప్ప‌టికే ఈ నిర్ణ‌యానికి రావ‌డం కూడా తెలిసింది. ఇవ‌న్నీ సాకారం కావాలంటే.. సీఎం ర‌మేష్ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని బాబు ధృఢంగా నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

పారిశ్రామికవేత్తలతో సంబంధాలు…

దీనికి తోడు వ్యాపారపరంగా ఢిల్లీ సహా ఇతర దేశాల పారిశ్రామికవేత్తలతో సీఎం రమేష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకి ఈ అంశం కలిసివస్తుందని కూడా బాబు భావిస్తున్న‌ట్టు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. ఇదిలావుంటే, ప్ర‌స్తుతం కేంద్రంపై పోరుబాట ప‌ట్టిన టీడీపీ వాయిస్‌ను పార్ల‌మెంటులో ర‌మేష్ బ‌లంగా వినిపిస్తున్నాడు. లోక్‌స‌భ‌లో గుంటూరుఎంపీ గ‌ల్లాజ‌య‌దేవ్ మాదిరిగా రాజ్య‌స‌భ‌లో సీఎం ర‌మేష్ జోరుగా మాట్లాడుతున్నార‌ని బాబు గుర్తించారు. ఇలా అన్ని విధాలా సీఎం రమేష్‌కు పరిస్థితులు కలిసిరావడం, చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డ‌డంతో రెండవసారి రాజ్యసభకి అవకాశం దక్కిందని రాజకీయ విశ్లేషకులు, కడప జిల్లావాసులు భావిస్తున్నారు. మ‌రి బాబు పెట్టుకున్న ఆశ‌ల‌ను ర‌మేష్ ఇంకెంత మేర సాధిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*