లగడపాటి సర్వే కూడా అంతేనా…?

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చింది. లగడపాటి సర్వే కొంత ఖచ్చితంగా ఉంటుందని చెబుతారు. గతంలో ఆయన చేయించిన సర్వేలు కూడా లెక్కింపులో దాదాపు అదే ఫలితాలు రావడంతో లగడపాటి సర్వేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో లగడపాటి టీం జరిపిన సర్వే కూడా నిజమైంది. తాజాగా లగడపాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో తన ఫ్లాష్ టీంతో సర్వే చేయించారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.

స్వయంకృతాపరాధమే….

ఇక్కడ కాంగ్రెస్, సమాజ్ వాదీ కూటమిగా ఏర్పడినా మోడీ హవా ముందు ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అధికార సమాజ్ వాదీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీ బలం పెరగడానికి కారణంగా సర్వేలో చెప్పారు. కాంగ్రెస్ తో సమాజ్ వాదీ కలవడం కూడా ఆ పార్టీకి చేటు చేకూరిందన్నారు. అలాగే సమాజ్ వాదీ పార్టీలో ఎక్కువ మంది నేరస్థులకు సీట్లు ఇవ్వడం కూడా ప్రజా వ్యతిరేకత పెరగడానికి కారణమని తెలిపారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కు చేరువుగా సీట్లు లభించే అవకాశాలున్నట్లు లగడపాటి ఫ్లాష్ టీం సర్వేలో తేలింది. అయితే మోడీ వ్యూహం ఉత్తరప్రదేశ్ లో ఫలించిందని చెప్పటానికి రైతు రుణమాఫీ ఉదాహరణగా సర్వేలో చెప్పారు. మోడీ రైతు రుణమాఫీ హామీ సన్న, చిన్నకారు రైతుల్లో బాగా పనిచేసిందని, ఎక్కువ శాతం మంది రైతులు ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలబడ్డారని తెలిపింది. అలాగే సమాజ్ వాదీ పార్టీ చివరి నిమిషంలో వరాలు ప్రకటించినా అవి పనిచేయలేదన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి 120 నుంచి 140 స్థానాలు, కాంగ్రెస్ కు 35 స్థానాలకు మించవని ఫ్లాష్ టీం పేర్కొంది.

పంజాబ్ లో కాంగ్రెస్ దే…

ఇక పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందని లగడపాటి సర్వే తేల్చింది. అకాళీదళ్, బీజేపీ కూటమిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అది కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందన్నారు. కాంగ్రెస్ పంజాబ్ 70 స్థానాలకు పైగా సాధిస్తుందని తెలియజేశారు. మొత్తం మీద లగడపాటి సర్వే కూడా ఎగ్జిట్ పోల్స్ కొంచెం అటు..ఇటుగానే ఉన్నా…ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని చెప్పటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*