వీడు పోలీసోడు కాదు….కిరాతకుడు

కంచె చేను మేసింది. బాధితులను రక్షించాలిసిన బాధ్యత గల పోలీస్ అధికారే హంతకుడి అవతారం ఎత్తాడు. ఈనెల 6 వ తేదీన విశాఖలో జరిగిన గేదెల రాజు మర్డర్ కేసు కీలక మలుపులు తిరిగి ఏ వన్ ముద్దాయి డిఎస్పీ రవిబాబు జైలు కి పోవడంతో ఆగిపోలేదు. ఈ కేసులో అనేక చీకటి కోణాలను వెలుగు చూసేలా చేసింది . మాజీ ఎంపిపి పద్మలత హత్యకు కోటి రూపాయలు సుపారీ గేదెల రాజుకు ఇచ్చేలా డీల్ కుదుర్చుకోవడం, రాజుకు ఇవ్వాలిసిన మిగిలిన సొమ్ము ఎగ్గొట్టేందుకు ఒక పత్రిక అధినేతతో పదిలక్షల డీల్ కుదుర్చుకుని గేదెలరాజును లేపించేయడం ఇలా ఒక క్రైం ధ్రిల్లర్ ఎపిసోడ్ లా నడిచింది డిఎస్పీ వ్యవహారం.

కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు …

పోలీసు గాలింపు చర్యలతో విసిగిపోయిన ప్రస్తుత విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు ఇక లాభం లేదని ఖాకీలకు లొంగిపోయాడు. ఆయన్ను ఒక పగలు రాత్రి విచారించిన విశాఖ పోలీసు ఉన్నతాధికారులు మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించాక కోర్టు కి హాజరు పరిచారు. రవిబాబుకి ఈనెల 27 వరకు కోర్ట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా రవిబాబు కేసులో పోలీసులకు ఈ హత్యలకు సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. గేదెలరాజు మర్డర్ కి పదిలక్షల సుపారికి రెండు చెక్కులుగా ఈ కేసులో ఏ 2 గా వున్న క్షత్రియ భేరి పత్రికా సంపాదకుడు భూపతిరాజు శ్రీనివాస రాజు కుమారుడు రాహుల్ బ్యాంక్ ఎకౌంట్ లో రెండు ఐదేసి లక్షల రూపాయల చెక్ లు డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు. వీటితో పాటు పద్మలత హత్యకు దారితీసిన పరిస్థితులు వ్యాపార లావాదేవీలు గేదెలరాజుతో బీచ్ రోడ్డులో మరో పాతికలక్షలకు జరిగిన ఒప్పందం , రాజు చేతిలో పద్మలత హత్య కు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ దర్యాప్త్ అధికారులకు చిక్కాయి.

కేసులో 12 మంది ఇప్పటికి 10 మంది అరెస్ట్ …

గేదెలరాజు, పద్మలత హత్య లకు సంబంధించి ఇప్పటికి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు. ఇదిలావుంటే రవిబాబు మాత్రం మిడియా ముందు తాను అమాయకుడినంటున్నారు. న్యాయపరంగా కేసును ఎదుర్కొని బయటపడతా అని చెప్పడం విశేషం. ఈ కేసు నుంచి రవిబాబు ను తప్పించేందుకు కొందరు రాజకీయ పెద్దలు పైరవీలు ముమ్మరం చేశారని ప్రచారం సాగుతుంది.

1 Comment on వీడు పోలీసోడు కాదు….కిరాతకుడు

  1. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్.. ఇతనొక్కడే కాదండీ…దొరికారు కాబట్టి రవిగారిని అందరూ ఆడిపోసుకుని..శాపనార్ధాలు పెడుతున్నారు.. ఎంతమందికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయో లెక్క కట్టగలిగే సత్తా ఎవరికీ లేదు కాబట్టి చెలరేగి పోతున్నారు సార్…

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1