వీరికి నాలుగు రోజులూ నిద్ర కరువేనా?

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరిగే అంతర్జాతీయ సదస్సు కి పోలీసులు నిఘా పటిష్టం చేశారు .. రెండువేల రెండు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున హోంగార్డు నుండి కమిషనర్ వరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ , ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు పై గట్టినిఘా ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

2,200 మందితో బందోబస్తు….

హైద్రబాద్ లో బందోబస్తు అంటే పోలీసులకి కత్తి మీద సాము లాంటిది … ఎక్కడ చీమ చిట్టుకుమన్నా వెంటనే పోలీసులు వాలి పోయే విధంగాఏర్పాట్లు చేస్తారు. ఇక ఈనెల 28, 29 న ప్రపంచ స్థాయిలో జరిగే ఇంటెర్నేషనల్ సమ్మిట్ కి వివిధ దేశాలు నుండి పారిశ్రామిక వేత్తలు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరు కానున్నారు .. దీంతో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించి భారీ బందోబస్తు నడుమ సదస్సు నిర్వహించేలా ప్లాన్ చేశారు పోలీసులు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరు అవుతుండడం తో పోలీసులు నిఘా పటిష్టం చేశారు .. దీంతో పాటు మెట్రో రైలు ప్రారంభోత్సవకార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ నెల 28 తేదీన బేగంపేట్ విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టార్ ద్వారా మియాపూర్ కి ప్రధాని చేరుకుంటారు .. అక్కడ మెట్రో ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు .. ఇందు కోసమా పూర్తి బందోబస్తు ను సిద్ధం చేసినట్లు నగర సీపీ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా….

ఇక ప్రధాని మోడీతో పాటు ఇవాంకా ట్రంప్ మరో వందమంది విశిష్ట అథితులు హాజరుకానున్నారు .. హెచ్ ఐ సీ సీ లో సదస్సు ముగించుకొని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే మీదుగా విందుకు ఫలక్ నుమా ప్యాలెస్ కి చేరుకుంటారు .. ఇందుకోసం నాలుగు కాన్వాయ్ లతో పాటు పారిశ్రామిక వేత్తలు కోసం 45 బస్సులు ఏర్పాటు చేసి నిమిషాల్లో హెచ్ ఐ సీసీ నుండి ఫలక్ నుమా కి చేరుకొనే విధంగా వివిధ శాఖ అధికారులు తో సమన్వయం చేసుకొని ముందుకి వెళుతున్నాంమని సీపీ శ్రీనివాసరావు తెలుగుపోస్ట్ కు చెప్పారు. ఇక ప్రధాని భద్రత పై కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు , వివిధ విభాగాలకు చెందిన బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు .. ఇక ఇంవాంకా ట్రంప్ కి సంబంధించి అమెరికా భద్రతా అధికారులు , సీక్రెట్ సర్వీస్ అధికారులతో చర్చించి ముందుకు వెళుతున్నామన్నారు .. దాదాపు రెండు గంటలు పాటు ఫలక్ నుమా ప్యాలస్ లో ప్రధాని మోడీ ఉండే అవకాశం ఉందని , అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారని పోలీస్ కమిషన్ తెలిపారు.

రోజూ సెర్చ్ ఆపరేషన్…..

పాత్ బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాలు పై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు .. ఇప్పటికే పది రోజులు వ్యవధిలో రెండు సార్లు కార్టన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ప్రజల సహకారం తో కొంత మంది అనుమానితులు ను అదుపులోకి తీసుకున్నారు . ఇక ప్రతేకంగా ఈ సమ్మిట్ కి ఐబీ హెచ్చరికలు ఏమీ లేనప్పటికి , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,అలర్ట్స్ పై అధికారులు తో సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించారు. ప్రతి విషయాన్నీ సీసీ కెమెరాలు ద్వారా నిఘా పటిష్టం చేసి ,నగరం లోనే అన్ని సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ఫలక్ నుమా ప్యాలెస్ కి వచ్చే సమయం లో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక గోల్కొండ లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న డిన్నర్ కి రాణి మహల్ లో కూడా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని , రాణిమహల్ లోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు .. ఇంవాంకా చార్మినార్ సందర్శన పై అధికారకంగా ప్రకటన ఇంకా రాలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*