వైసీపీ నేతను సస్పెండ్ చేసిన జగన్

వైయస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతం రెడ్డి విజయవాడలో ఓ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారని, వాటి ప్రోమోలు విడుదల అయ్యాయని వాటిలో ఆయన వంగవీటి రంగా, రాధాలను ఉద్దేశించి చేసిన అభిప్రాయాలను వైయస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పార్థసారధి తెలిపారు. దివంగత నాయకుడు వంగవీటి రంగాను, పార్టీ నాయకుడు మల్లాది విఘ్ణ గురించి చేసిన అభిప్రాయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా దివంగత నాయకుడు వంగవీటి రంగా గారిని మేం అందరూ అభిమానిస్తామని, రాష్ట్రంలోని పేదవర్గాలు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తారని తెలిపారు. రంగాను ఉద్దేశించి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్థసారధి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా గురించి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ తీవ్రంగా పరిగణించిందని ఈ సందర్భంగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయటం జరిగిందని పార్థసారధి తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే..ఏ వ్యక్తి గురించి కానీ, ఏ వర్గం గురించి కించపరిచి మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ సందర్భంగా పార్థసారధి తెలిపారు. మరోసారి వంగవీటి మోహన రంగా గురించి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్థసారధి స్పష్టం చేశారు. అయితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. గౌతమ్ వ్యాఖ్యలపై కాపులు, రంగా అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గౌతమ్ రెడ్డిపై సత్యనారాయణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*