శంషాబాద్ ఎయిర్ పోర్టు తాుగుబోతుల అడ్డా…!

ఎయిర్ పోర్టులో తాగుబొతులు రెచ్చి పొతున్నారు. వీకెండ్ వచ్చిదంటే చాలు తాగి ఎయిర్ పోర్టు టెర్మినల్ వరకు వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు తాగుబోతులకు ఎయిర్ పోర్టు అడ్డాగా మారింది. అర్థరాత్రి సమయంలో ఎయిర్ పోర్టులో రక్షణ కరువైంది. ఇండిగో ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బంది పట్ల తాగుబోతులు అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు ఇది. పోలీసులు సకాలంలో స్పందించక పొయి వుంటే చాల దారుణం చోటు చేసుకునేది.

బార్లు 24 గంటలూ తెరిచి ఉండటంతో…..

ఇది ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్టు..అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. అయితెనే.. ఇక్కడ డ్రగ్స్, గోల్డ్ మాఫియాలు అడ్డాగా చేసుకున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడ నానా హంగామా నడుస్తుంది. అంతేగాకుండా ఇక్కడ వున్న హొటల్స్ , పబ్స్ లో యువకులు రచ్చ చేస్తుంటారు..హైదరాబాద్ సిటిలో రాత్రి పన్నెండు గంటలకు అన్ని పబ్స్, బార్లు నిబంధనల ప్రకారం క్లోజ్ అవుతుంటాయి. ఎయిర్ పోర్టులో మాత్రం ఇరవై నాలుగు గంటల పాటుగా అన్ని నడుస్తుంటాయి. దీనిని ఆసరాగా చేసుకుని యువకులు రెచ్చి పోతున్నారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఈ హంగామా ఎక్కువగా వుంటుంది.. అర్థరాత్రి సమయంలో టెర్మినల్ ప్రాంతంలో ఇద్దరు యువకులు తాగిన మత్తులో హంగామా చేశారు.అటుగా వెళ్లుతున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు..డ్యూటీలు ముగించుకుని వస్తున్న మహిళా ఉద్యోగులు, ఎయిర్ హొస్టెస్ పై వెకిలి చేష్టలు చేశారు. ఇలా గంటకు పైగా నానా హాంగామా చేశారు. ఇలా తంతు జరుగుతున్న సమయంలోనే ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన మహిళా సిబ్బంది తమ విధులను ముగించుకుని బయటికి వచ్చారు. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఈ తాగుబోతుల కంట పడింది ఎయిర్ హొస్టెస్. దీంతో ఈ మహిళ దగ్గరకు పోయి నానా హంగామా చేశారు. వీరి ప్రవర్తన పూర్తిగా శృతి మించడంతో పోలీస్ కంట్రొల్ రూమ్ కు కాల్ చేసింది ఆమె. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులను చూస్తునే యువకులు ఇద్దరు పరుగులు పెట్టారు. బైక్ మీద పారిపొతుంటే. పోలీసులు వెంట పడి పట్టుకున్నారు. ఎయిర్ పొర్టులో వున్న పోలీస్ సెష్టన్ కు ఇద్దరు పోకిరీలను తీసుకుని వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.