శశికళ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటారా?

పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పన్నీర్ సెల్వం వెంట ఎవరూ లేరని చిన్నమ్మ చెబుతున్నారు. తన వెంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ ధీమాగా ఉన్నారు. నిన్న రాత్రంగా పోయెస్ గార్డెన్ లో సీనియర్ నేతలతో సమావేశమై చర్చించారు. పరిస్థితిని సమీక్షించారు.

123 మంది హాజరు….

తమిళనాడులో అన్నాడీఎంకేకు 134 మంది సభ్యులున్నారు. అందులో ఎంతమంది సభ్యులు శశికళకు అండగా నిలుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. శశికళ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి దాదాపు 123 మంది సభ్యులు హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో శశి ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయితే పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలిసి తనకు మెజారీటీ సభ్యుల మద్దతు ఉందని చెబుతారంటున్నారు. దీంతో చిన్నమ్మకు తమిళనాడు శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బల నిరూపణకు కొంత సమయం పడుతుంది. ఈలోపు ఎమ్మెల్యేలంతా శశికళ వెంట ఉంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

మ్యాజిక్ ఫిగర్ 118…

కాగా తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలున్నాయి. 118 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. 118 మంది సభ్యుల మద్దతు ఉంటే చిన్నమ్మ సీఎం పీఠంపై కూర్చేనే వీలుంటుంది. శశికళ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి 123 మంది సభ్యులుంటారు. ఇంకో ఆరుగురు సభ్యులు హ్యాండ్ ఇస్తే చిన్నమ్మకు ఛాన్స్ దక్కదు. ఈ నేపథ్యంలో డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలం పన్నీర్ వైపు మొగ్గిందంటే…. ఇక చిన్నమ్మ అసెంబ్లీలోకి అడుగుపెట్టే వీలే ఉండదు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్ధులు ఇద్దరున్నారు. వీరందరూ పన్నీర్ వైపు మొగ్గితే ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.

పన్నీర్ వైపే డీఎంకే?…

డీఎంకే తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తోంది. అన్నాడీఎంకేలో చీలిక తెస్తే తమదే ఇక తమిళనాడు అని భావిస్తోంది. అందుకోసమే కొన్ని రోజులు పన్నీర్ కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కొద్దికాలం సపోర్ట్ చేసి విత్ డ్రా చేసుకుంటే మళ్లీ ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికల్లో జయ లేని అన్నాడీఎంకే గెలవడం అసాధ్యం. తమదే గెలుపని డీఎంకే నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. మొత్తం మీద తమిళనాడులో పరిస్థితిపై కేంద్రం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*