శశికళకు రాజభోగాలందడానికి కారణం ఇతడేనా?

కర్ణాటక జైల్లో అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు రాజభోగాలు అందడం వెనుక కోట్ల రుపాయలు చేతులు మారినట్లు జైళ్ల శాఖ మాజీ డిఐజీ రూప ఆరోపించారు. శశికళ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. జైల్లో శశికళకు సిబ్బంది రాచమర్యాదలు చేయడం వెనుక కోట్లాది రుపాయలు చేతులు మారాయని కర్ణాటక అవినీతి నిరోధక శాఖకు రూప ఫిర్యాదు చేశారు. బెంగళూరులో ఆస్ట్రేలియా ప్రకాష్‌గా చలామణి అయ్యే విఎస్‌ ప్రకాష్ ద్వారా శశికళకు సేవలు అందాయని రూప తెలిపారు. వి.ఎస్‌ ప్రకాష్‌కు పోలీస్‌ అధికారులతో ఉన్న పరిచయంతోనే జైల్లో మల్లిఖార్జున-శశికళ మధ్య గంటల తరబడి చర్చలు జరిగినట్లు చెప్పారు. సందర్శకులతో శశికళ ప్రత్యేక గదిలో సమావేశమవడం తీవ్రమైన విషయమని., సిసిటివి ఫుటేజీలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుందన్నారు. విఎస్‌ ప్రకాష్‌ ఏర్పాటు చేసిన సమావేశాల ఫలితంగా శశికళకు రాచమర్యాదలు అందాయని చెప్పారు. జైలు రికార్డుల్లో నమోదు కాకుండా విఎస్‌.ప్రకాష్‌ నేరుగా జైల్లోకి రాకపోకలు సాగించడాన్ని కూడా రూప తప్పుపట్టారు. విజిటర్స్‌ బుక్‌లో సంతకం చేయకుండానే ప్రకాష్‌ లోపలకు వెళ్లడానికి భద్రతా దళానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ గజరాజ్‌ మకనూర్‌ సాయం చేశారని రూప పేర్కొన్నారు. గేట్‌ నెంబర్‌ 1,2,తో పాటు 8వ నంబర్‌ కెమెరాల ఫీడ్‌లను పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు. జైలు సూపరింటెండెంట్‌ కృష్ణకుమార్‌ మధ్య వర్తిత్వం నెరిపి జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణ రావుకు మల్లికార్జున్‌., దినకరన్‌లు రూ.2కోట్ల లంచం అందంచేసినట్లు తన వద్ద సమాచారం ఉందని రూప ఆరోపించారు.

శికళ కోసం చేతులు మారిన కోట్లు…..

ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరపాల్సి ఉందని ఆమె డిమాండ్‌ చేశారు. జైల్లో శశికళకు రాజభోగాలు బయటపెట్టినందుకు తనను జైళ్ల శాఖ నుంచి తప్పించడంపై రూప ఆగ్రహంతో ఉన్నారు. సరైన దర్యాప్తు జరిపి… జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణ రావు., అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌7,13(1)డి, 13(2) మధ్యవర్తి ప్రకాష్‌లపై సెక్షన్‌ 8,9 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శశికళతో పాటు నకిలీ స్టాంపుల కుంభకోణంలో జైలు శిక్షను అనుభవిస్తోన్న కరీం లాల్‌ తెల్గీకి కూడా మంచం., వాటర్‌ ప్యూరిఫైయర్., ఎల్‌ఇడి టీవీ సౌకర్యాలు కల్పించినట్లు రూప ఫిర్యాదు చేశారు. అతనికి ముగ్గురు అండర్‌ ట్రయల్‌ ఖైదీలను సహాయకులుగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. పరప్పణ అగ్రహార లోని జైలు వ్యవహారాలపై రూప సంచలన విషయాలు వెలుగులోకి తీసుకురావడంతో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇరుకున పడింది. శశికళ., ఇళవరసి జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వెళ్లి వస్తున్న దృశ్యాలను సైతం రూప ఏసిబికి అందచేశారు. జులై 31న జైళ్ల శాఖ డిజీ సత్యనారయణ రావు రిటైర్‌ అయిన రోజే ఆమెకు ఏసీబీ నుంచి నోటీసులు అందాయి. తాను చేసిన ఆరోణలకు సంబంధించి రూప 74 ఆధారాలను ఏసీబీకి సమర్పించారు. రూప ఆరోపణలపై న్యాయవిచారణ జరిపించాలని మాజీ డీజీ కూడా కోరుతున్నారు. పరప్పణ అగ్రహార జైల్లో శశికళకు సొంత కిచెన్‌ ఏర్పాటు చేయడం., అన్నిసేవలు లభ్యం కావడంపై రూప ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు. మరోవైపు తమిళనాడులో శశికళకు చెక్‌ పెట్టే విధంగా ఓపీఎస్‌-ఈపీఎస్‌ కలిసి పోవడంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదే సమయంలో బీజేపీ పరప్పణ అగ్రహారం జైలు వ్యవహారాలపై దృష్టి సారిస్తే శశికళ గ్రూపుకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1