సీఎంగా శివపాల్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీలో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలతో
ఇటు సీఎం అఖిలేష్, అటు ములాయం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ
ములాయంతో కొంత మొహమాట పడిన అఖిలేష్ తనపై బహిష్కరణ వేటు తర్వాత దూకుడు పెంచారు.
ఎమ్మెల్యేలతో సమావే‏శంలో తనను సీఎంగా కొనసాగించే విషయంపై చర్చిస్తారని తెలిసింది. తనకున్న క్లీన్
ఇమేజ్, గత నాలుగున్నరేళ్లుగా యూపీలో జరిగిన అభివృద్ధి వచ్చే ఎన్నికల్లో విజయానికి కారణాలవుతాయని
ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. మరోవైపు ములాయం కూడా ఎమ్మెల్యేలతో ఈరోజే భేటీ అవుతున్నారు.
అఖిలేష్ స్థానంలో శివపాల్ యాదవ్ ను సీఎం చేసే విషయంపై ఆయన చర్చిస్తారని చెబుతున్నారు.
శివపాల్ యాదవ్ ను సీఎంగా కూర్చోబెట్టి ఎన్నికలకు వెళ్లాలన్నది పెద్దాయన ప్లాన్. అయితే అదే జరిగితే
బీఎస్పీ రంగంలోకి దిగే అవకాశముంది. విశ్వాస పరీక్షకు బీఎస్పీ డిమాండ్ చేస్తుంది. అప్పడు ఎస్పీలో
చీలికతో విశ్వాస పరీక్ష నెగ్గడం రెండు వర్గాలకూ కష్టమే. అప్పుడు గవర్నర్ దే కీలకపాత్ర కాబోతోంది. మొత్తం
మీద సమాజ్ వాదీ పార్టీలో ఈరోజు రెండు సమావేశాలు కార్యకర్తలకు ఉత్కంఠను రేపుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1