సీఎం అభ్యర్ధి అఖిలేష్: ములాయం

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల మధ్య వార్ ముగిసినట్లుంది. కొద్దిసేపటి క్రితం ములాయం యూపీ సీఎం అభ్యర్ధిగా అఖిలేష్ యాదవ్ ను ప్రకటించారు. దీంతో తండ్రికొడుకుల మధ్య వార్  కు తెరపడినట్లేనని చెబుతున్నారు. ములాయం ఓటమిని అంగీకరించినట్లయిందని పరిశీలకుల భావన.

సోమవారం ఉదయం కూడా ములాయం ఈసీని కలిశారు. సైకిల్ గుర్తును తమకే కేటాయించాల్సిందిగా కోరారు. అయితే ఉన్నట్లుండి అఖిలేష్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించడంతో సమాజ్ వాదీ చీలిక లేనట్లేనని చెబుతున్నారు. అయితే ములాయం ఢిల్లీలో ఈ ప్రకటన చేశారు. అఖిలేష్ తో మాట్లాడలేదు. దీనిపై అఖిలేష్ కూడా స్పందించలేదు. ఎక్కువ మంది నేతలు, పార్టీ నేతలు అఖిలేష్ కే మద్దతు తెలిపడంతో తప్పని సరి  పరిస్థితుల్లో పెద్దాయన రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1