సుమన్ నీకిది తగునా…?

ప్రొఫెసర్ పై పూర్వ విద్యార్థి మాటల దాడికి దిగుతున్నారు. గురువును మించిన శిష్యుడైనా….తనకు పాఠాలు నేర్పిన గురువు మీదనే ఫైర్ అవుతున్నారు ఈ యువ ఎంపీ బాల్క సుమన్. నిన్న టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సుమన్ ఎదురు దాడికి దిగారు. కోదండరామ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని…లేకుంటే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని కూడా సుమన్ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో కోదండరామ్ భాగస్వామిగా మారాడని సుమన్ ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ ధర్నా చేస్తుంటే కోదండరామ్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయం కోదండరామ్ కు ఎందుకన్నారు. లక్షలాది మంది కోదండరామ్ లు అడ్డుపడినా కోటి ఎకరాలకు సాగిచ్చితీరతామని సుమన్ అన్నారు.

ఆ స్థాయి ఉందా?
కోదండరామ్ ను విమర్శించే స్థాయి సుమన్ కు లేదన్నది తెలంగాణలో అధిక మంది ప్రజల అభిప్రాయం. తెలంగాణ ఉద్యమంలో సుమన్ ఏం ఇరగపొడిచాడని కూడా తిరిగిప్రశ్నిస్తున్నారు. రెండు, మూడుసార్లు అరెస్టైతే నాయకుడవుతారా? ఓయూ విద్యార్థి జేఏసీని నిర్వీర్యం చేసింది సుమనే నన్నది ఓయూ విద్యార్థుల అభిప్రాయం. ఓయూలోనే చదివి అక్కడ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? అని అంటున్నారు. గాలి వాటాన ఎంపీగా గెల్చిన సుమన్  కు భవిష్యత్ లో ప్రజలే సమాధానం చెబుతారంటున్నారు. కోదండరామ్ పై విమర్శలు చేయడానికి టీఆర్ఎస్ నేతలు ఎవరూ సాహసించరు. మంత్రి హరీశ్ రావు విమర్శించినా హుందాగా వ్యాఖ్యలు చేస్తారు. కాని కేసీఆర్ మెప్పు పొందడానికే ప్రొఫెసర్ పై సుమన్ విమర్శలు చేస్తున్నారని గులాబీనేతలు కూడా అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*