సెంచరీ కొట్టిన జగన్

వైసీపీ అధినేత జగన్ సెంచరీ కొట్టేశారు. అదే.. పాదయాత్ర లో ఆయన వంద కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. ఈనెల 6వ తేదీన జగన్ ఇడుపుల పాయనుంచి పాదయాత్రను ప్రారంభించారు. మధ్యలో శుక్రవారం నాడు పాదయాత్రకు విరామమిచ్చారు. కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున జగన్ ఆ రోజు పాదయాత్ర చేయలేదు. దీంతో ఎనిమిది రోజుల్లోనే వంద కిలోమీటర్లు జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. తొలి వారం రోజులు కడప జిల్లాలో పర్యటించారు. కడప జిల్లాలో పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. జగన్ మంగళవారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

తొమ్మిదో రోజుకు చేరిన….

తొమ్మిదో రోజు జగన్ పాదయాత్ర ఇలా సాగనుంది. తొమ్మిదో రోజు దాదాపు 14 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్నారు. నిన్న రాత్రి చక్రవర్తులపల్లిలో బస చేసిన జగన్ ఉదయం 8గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే జగన్ పర్యటన ఉంటుంది. ఆళ్లగడ్డ మండలం పెద్ద కోట కందుకూరు గ్రామంలో జగన్ పార్టీ జెండాను ఎగురవేస్తారు. మధ్యాహ్నం అక్కడే భోజన విరామానికి ఆగుతారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఆళ్లగడ్డ మండలం నాలుగు రోడ్ల జంక్షన్ లో బహిరంగ సభలో మాట్లాడతారు. జగన్ కు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెద్దయెత్తున స్వాగతం లభిస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1