హార్థిక్ పటేల్ ఇలా చేశారా?

గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ ను టార్గెట్ గా చేసుకుని ఒక వీడియోను బయట పెట్టారు. హార్థిక్ పటేల్ ఒక మహిళతో హోటల్ గదిలో శృంగార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఈ వీడియోను కొందరు విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హార్థిక్ పటేల్ గత కొన్నేళ్లుగా పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దీంతో బీజేపీయే ఈ వీడియోను బయటపెట్టిందని హార్థిక్ పటేల్ ఆరోపిస్తున్నారు. అందులో ఉన్నది తాను కాదని హార్థిక్ స్పష్టం చేశారు. బీజేపీ కావాలనే తనను ప్రజల్లో చులకన చేయడానికి ఈ సరికొత్త డ్రామాకు తెరలేపిందని, ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయమని హార్థిక్ చెప్పడం విశేషం.

కాంగ్రెస్ కే మద్దతు….

అయితే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అని హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. పటేళ్ల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు హార్థిక్ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిధిలోనే పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని తమ ఆశయమన్న హార్థిక్ కాంగ్రెస్ ప్రతిపాదన ఇతర సామాజిక వర్గాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. హార్థిక్ పటేల్ ప్రస్తుతం పటేల్ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీపై ఆయన ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద గుజరాత్ లో ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వస్తాయన్న టెన్షన్ నేతలను పట్టుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1