2.0 ప్రీమియర్ టాక్

Rajinikanth Akshay Kumar 2.0 collections

సూపర్ స్టార్ తాజా చిత్రం విజువల్ వండర్ 2.0 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో 2.0 ప్రీమియర్స్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ నటించడం అనేది మరింత ఆకర్షణ కాగా.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా 10,000 వేల థియేటర్స్ పైగానే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైకా ప్రొడక్షన్ 600 కోట్ల భారీ బడ్జెట్ పెట్టిన ఈ సినిమా లో కథ కు ఎక్కువ ప్రాధాన్యతనివ్వకపోయినా… గ్రాఫిక్స్ కి శంకర్ ఎంతగా ఇంపార్టెన్స్ ఇచ్చాడో ప్రతి ఫ్రెమ్ లో కనబడుతుందని…. ప్రీమియర్స్ చూసిన వారి మాట.

ఒక మంచి మెసేజ్‌ని కీలకంగా తీసుకున్న శంక‌ర్.. ఈ చిత్రాన్ని త‌న‌దైన శైలిలో గ్రాపిక్స్ విజువ‌ల్స్‌తో మాయ చేశాడ‌ని, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాని ప‌రుగులు పెట్టించార‌ని, ర‌జినీ, అక్ష‌య్ న‌ట‌న అద్భుత‌మ‌ని, ఏ ఆర్ రెహ్మాన్ బ్యాగ్రౌండ్ స్క్రోర్ హైలెట్ అని, ఇక సినిమా క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంద‌ని.. కాకపోతే శంకర్ తీసుకున్న పాయింట్ బాగుంది అనే అభిప్రాయాలను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2.0 వీఎఫ్ఎక్స్ వర్క్ అధ్బుతమని ఓవర్సీస్ ప్రేక్ష‌కులు చెబుతున్నమాట. మరి 2.0 ఫైనల్ రిజెల్ట్ తెలియాలంటే రివ్యూ కోసం కాస్త వెయిట్ చేస్తే సరిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*