
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదినారాయణ రెడ్డికి నియోజకవ ర్గంలో ఎదురు గాలి వీస్తోందని సమాచారం. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆది ఆ తర్వాత చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో ఆయన టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో ఆయన గ్రాఫ్‌పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఆయన స్థానిక టీడీపీ నేతలను కలుపుకొని పోవడం లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అదేసమయంలో ప్రజలకు సైతం అందుబాటులో ఉండడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకత ఆయనను ఇంటికే పరిమితం చేస్తుందని అనే వారూ ఉన్నారు.
అభివృద్ది కోసమే…..
అయితే, ఆది నారాయణరెడ్డి యాంగిల్లో చూస్తే.. మాత్రం చాలా డిఫరెంట్ వివరణ వినిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి, మరోవైపు పార్టీ అభివృద్ధికి తాను పని చేస్తున్నానని అంటున్నారు ఆది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార తెలుగుదేశం పార్టీలో చేరానని, ఆ తర్వాతి పరిణామాల్లో రాష్ట్ర మంత్రి నయ్యానని అంతే తప్ప తనకు మంత్రిప దవిపై వ్యామోహం లేదనేది ఆయన వాదన., నియో జకవర్గంలోని ఆరు మండలాల్లో పలు గ్రామాల్లో తాగునీటి వనరులను అభివృద్ధి చేయడంతో పాటు శుద్ధి జలాలను అందించేందుకు వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయించినట్టు తెలిపారు. దీంతో నదీ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోర్లలో నీరు రావడంతో పంటల సాగుకు కూడా సాధ్యమైందని వివరించారు.
రోడ్లను అన్ని చోట్లా….
ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నానని ఆయన అనుచరులతో చెప్పించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లింక్‌రోడ్లను అభివృద్ధిపరిచినట్టు ప్రచారం చేస్తున్నారు. పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ గతంలో ఉన్న రహదారులకు తారు, సిమెంటు రోడ్లను ఏర్పాటు చేశారు. దీంతో వ్యవసాయ పొలాల్లోకి కూడా వాహనాలు వెళ్లేందుకు వెసులుబాటు కలుగడంతో రైతులకు సామగ్రిని తీసు కెళ్లడం సులభతరమవుతుంది. నివాస ప్రాంతాల మధ్య కూడా సిమెంటు రోడ్లు నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల ఏర్పాటుతో రహదారుల సమస్య తొలగి పోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేపట్టినప్పటికి రైతులు ప్రొద్దుటూరు, తదితర ప్రాంతాలకు తమ దిగుబడులను తీసుకుపోవాల్సి వచ్చేది.
ప్రచారం మాత్రం రెండు రకాలుగా…..
ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాతనే మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రచారం ఊపందుకుంది. మొత్తంగా ఆది విషయంలో నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయానికి, ఆది అనుచరులు చేస్తున్న ప్రచారానికి చాలా భిన్నత్వం కనిపిస్తుండడం గమనార్హం. మరి దీనిని తట్టుకుని ఆది మళ్లీ పుంజుకుంటాడా? లేక నోటి దురుసుతనంతో ఓటమి చవి చూస్తాడా చూడాలి.
Leave a Reply