ఆళ్ల‌గ‌డ్డలో యూట‌ర్న్‌.. రీజ‌నేంటి..?

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ రాజ‌కీయాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డి టీడీపీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌న్న ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ టికెట్ కోసం నాయ‌కులు హోరాహోరీ త‌ల‌ప‌డ్డారు. ఒక‌రిని మించి ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. క‌త్తులు నూరుకున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు అక్క‌డ ఏం జ‌రిగింది? ఆ ర‌గ‌డ‌ల‌ను త‌గ్గించేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీసుకున్న తాజాగా తీసుకున్న చ‌ర్య‌లు ఫ‌లితాన్ని ఇచ్చాయా? భ‌విష్య‌త్తు ఏంటి? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

ఒకే ఫ్యామిలీకి రెండు…..

విషయంలోకి వెళ్తే.. క‌ర్నూలు రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆ స‌మ‌యంలో ఈ ఫ్యామిలీకి రెండు టికెట్లు కేటాయించారు. నంద్యాల, ఆళ్ల‌గ‌డ్డ టికెట్ల‌ను భూమా దంప‌తులకు జ‌గ‌న్ ఇచ్చారు. అయితే, ఎన్నిక‌ల‌కు ముందుగానే భూమా శోభ మృతి చెంద‌డంతో ఆమె టికెట్‌పై ఆమె కుమార్తె అఖిల ప్రియ పోటీ చేశారు. ఆళ్ల‌గ‌డ్డ నుంచి అఖిల గెలుపొందారు. ఇక‌, నంద్యాల నుంచి నాగిరెడ్డి గెలిచినా.. ఆ త‌ర్వాత ఆయ‌న ఆక‌స్మికంగా మృతిచెందారు. దీంతో ఈ టికెట్‌ను భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి కేటాయించారు., ఇలా ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇచ్చారు.

ఏవీ సుబ్బారెడ్డికి టిక్కెట్….?

అయితే, ఆళ్ల‌గ‌డ్డ‌పై ఆశ‌లు పెట్టుకున్నారు టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డి. అయితే, ఆయ‌న‌కు టికెట్ ఎక్క‌డ ఇస్తారో? వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎక్క‌డ టికెట్ ద‌క్క‌దో అనే బెంగ‌తో ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న అఖిల ప్రియ‌. తీవ్ర‌స్థాయిలో వివాదానికి తెర‌దీశారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి గెలుపున‌కు కృషి చేయ‌డ‌మేకాకుండా పార్టీకి అన్ని విధాలా అండ‌గా నిలిచిన ఏవీ సుబ్బారెడ్డి ఒక‌వైపు. త‌న పిలుపుతో పార్టీలో చేరిన భూమా ఫ్యామిలీ మ‌రోవైపు దీంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చేరింది. ఇద్ద‌రినీ కూర్చోబెట్టి రెండు మూడు సార్లు చెప్పిచూశారు., అయితే, ఫ‌లితం మాత్రం క‌నిపించ‌లేదు.

ఏవీని నియమిస్తూ…..

చివ‌ర‌కు సుబ్బారెడ్డి మీద రాళ్ల దాడి వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. ఈ వార్ ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణ‌గ‌ద‌ని అంద‌రూ భావించారు. దీంతో తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ఆళ్ల‌గ‌డ్డ‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం క‌ల్పించే దిశ‌గానే ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్ర విత్త‌నాభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌గా ఏవీ సుబ్బారెడ్డిని నియ‌మిస్తూ.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. వ్య‌వ‌సాయ ప‌రిధిలోదే అయినా.. దీనికి నిధులు ఎక్కువ‌గానే ఉంటాయి. దీంతో ఏవీ వ‌ర్సెస్ అఖిల ప్రియల మ‌ధ్య వార్ వేడి త‌గ్గుతుంద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం చంద్ర‌బాబు ఇప్పుడు ఈ డెసిష‌న్ తీసుకోవ‌డం ఏవీ వ‌ర్గంలో ఒక వైపు ఆనందం ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ వ‌స్తుందా ? రాదా ? అన్న బెంగ కూడా వారికి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*