బన్నీ అలా చేస్తున్నాడా?

అల్లు అర్జున్ – వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య’ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా కి కంటెంట్ వీక్ గా ఉందన్న కారణంగా యావరేజ్ టాక్ వచ్చింది. మరి సినిమా కి యావరేజ్ టాక్ వచ్చింది అంటే… సినిమాపై మరింత పబ్లిసిటీ పెంచితేనే కానీ… లేకుంటే.. ఆ టాక్ ప్రభావం కలెక్షన్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అయితే అల్లు అర్జున్ సినిమా విడుదలకు ముందు ‘నా పేరు సూర్య’ గురించిన ప్రమోషన్ పెద్దగా చెయ్యలేదు. కేవలం ఒక ఆడియో వేడుకని, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేసి… మిగతా ఇంటర్వూస్ లాంటివి పక్కన పెట్టేసి.. సినిమా విడుదలయ్యాక మహేష్ ‘బాబు భరత్’ అనే నెను సినిమాకి చేసినట్టుగా ప్రమోషన్ చెయ్యాలని అనుకున్నాడు బన్నీ.

యావరేజ్ టాక్ వచ్చేసరికి…..

అయితే సినిమాకి హిట్ టాక్ కాకుండా యావరేజ్ టాక్ పడేసరికి ఈ సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చెయ్యాలని నిర్ణయించుకుని అప్పుడే పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని ఛానల్స్ ని ఇండస్ట్రీలోని మెగా ఫ్యామిలీ బ్యాన్ చేసింది. అసలు మీడియా లోని కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చెయ్యడం అయ్యే పని కాదని సినీ పెద్దలు గమ్మునున్నప్పటికీ… మెగా ఫ్యామిలీ మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త గుర్రుగానే ఉంది. అందుకే ‘నా పేరు సూర్య’ యాడ్స్ ని కొన్ని ఛానల్స్ కి ఇవ్వకుండా ఆపేసింది. ఇక ‘నా పేరు సూర్య’ ని ఆ ఛానల్స్ మచ్చుకైనా పబ్లిసిటీ చేయడం లేదు.

కొన్ని ఛానల్స్ కు మాత్రమే….

అయితే ఇప్పుడు తాజాగా ‘నా పేరు సూర్య’ విడుదల ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన చిత్ర బృందం కొన్ని ఛానల్స్ ని పక్కన పెట్టేసిందనే టాక్ వినబడుతుంది. మీడియాలోని ప్రముఖ ఛానల్స్ ని అల్లు అర్జున్ కూడా పక్కన పెట్టేసి కొన్ని ఛానల్స్ కి మత్రమే ఇంటర్వ్యూ లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మరి అలా ఛానల్స్ మీద అలిగితే… ఎవరికీ నష్టం. మీడియా మీద అలక నా పేరు సూర్య కలెక్షన్స్ ని బాగా దెబ్బతీస్తాయని చాలామంది భవిస్తున్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఎం చెయ్యలేని పరిస్థితి. మొన్నటివరకు ఆయా ఛానల్స్ ని తిట్టిపోసి.. ఇప్పుడెళ్ళి ఆ ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వ్యూ లు ఇస్తే ఛండాలంగా ఉంటుందని అనుకుంటున్నాడేమో.. అందుకే సైలెంట్ గా ఉండక తప్పడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*