అటా ఆహ్వానం అదిరిపోయేలా…!

అమెరికన్ తెలుగు అసోసియేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను కలిసి తమ కన్వెన్షన్ కు హాజరుకావాలని ఆహ్వానాలను అందజేసింది. అటా కార్యక్రమాలు ఈ నెల 31, జూన్ 1,2 తేదీల్లో అమెరికాలో జరుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఆహ్వానించేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ వాసిరెడ్డి గత కొద్దిరోజుల నుంచి ఇక్కడే ఉండి తన బృందంతో కలసి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అటా కార్యక్రమాలకు హాజరై అమెరికాలోని తెలుగు వారికి మద్దతుగా నిలవాలని ఆయన వివిధ రాజకీయ పక్షాల నేతలను కోరారు.

అందరికీ ఆహ్వానం…..

కరుణాకర్ వాసిరెడ్డి బృందం కలసిన వారిలో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, వైసీపీ నేత వై.వి.సుబ్బారెడ్డి, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, టీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, వెంకటరమణ,బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, పద్మావతిలు ఉన్నారు. వీరంతా అమెరికాలో తెలుగువారికి అటా చేస్తున్న సేవలను అభినందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*