అదరహో….అమెరికాలో తెలుగు వైభవం…!

అమెరికన్ తెలుగు కన్వెన్షన్-2018 అట్టహాసంగా జరిగింది. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టేలా, అమెరికాలో నివసించే తెలుగు వారిని ఏకం చేస్తూ, మాతృభూమి మమకారాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆహ్లాదంగా వేడుకలు ముగిశాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా),తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీఏటీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలకు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. అమెరికాలోని తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డల్లాస్ నగరంలోని కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకు నిర్వాహకులు చేసిన భారీ ఏర్పాట్లు ఆహుతులను అలరించాయి.

మురిపించిన మొదటి రోజు…

మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో మొదటి రోజు చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది. తెలుగు ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సామాజిక సేవ, విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో చేసిన సేవలకు గానూ పలువురు తెలుగు వ్యక్తులను ఘనంగా సన్మానించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల గొప్పదనం, సంస్కృతి, సంప్రదాయాల విశిష్ఠత, తెలుగు ప్రజల ఐక్యత చాటేలా ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. గాయని మాళవిక, ఆల్ రౌండర్ కిరణ్ ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రమణీయంగా రెండో రోజు…

వేడుకల్లో కీలకమైన రెండోరోజు ఉత్సవాలకు హాజరైన ప్రజలకు మరిచిపోలేని అనుభూతులను మిగిల్చింది. మన సంస్కృతి, కళలు, వంటకాలు అన్నింటినీ ఒక్కచోట చేర్చారు నిర్వాహకులు. ‘తెలుగు వైభవం’ పేరుతో 125 మంది కళాకారులు నిర్వహించిన ప్రదర్శన మొత్తం కార్యక్రమానికే హైలైట్ గా నిలిచింది. జొన్నవిత్తుల రాసిన లిరిక్స్ కి, వందేమాతరం అందించిన మ్యూజిక్, సుధ కల్వకుంట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినీ నటులు శ్రియా శరణ్, సుధీర్ బాబు, తేజస్వీ మడివాడ, నవీన్ చంద్ర, రీచా పనాయ్, తేజస్వీని ప్రకాశ్, హేమ, జబర్దస్త్ ధన్ రాజ్, సుధీర్ లు చేసిన ప్రదర్శనలు ఆహుతులను కడుపుబ్బ నవ్వించాయి. ఫోక్ సింగర్లు మంగ్లీ, భిక్షూ నాయక్, జనార్ధన్ పన్నెల పాటలు ధూంధాంగా జరిగాయి. ఫ్యాషన్ వాక్, మాషప్ సింగింగ్ వంటి కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకలన్నీ ప్రధాన వేదికపై జరగ్గా అదే సందర్భంలో ఇతర వేదికలపై జరిగిన తెలుగు సాహిత్యం, మహిళా ఫోరం సమావేశాలు ఆలోచింపజేశాయి. ఇక మూడు రోజుల పాటు యాంకర్ గా సుమ ప్రదర్శన ఆహుతులను సీట్లకు అతుక్కునేలా చేసింది.

ముచ్చటగొల్పిన మూడోరోజు…

ఇక చివరి రోజు తెలుగువారి ఇష్టదైవం శ్రీనివాసుడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఇక సాయంత్రం లైవ్ రాక్ బ్యాండ్ తో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ దుమ్ముదులిపేశాడు. సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, రోహిత్, ప్రవీణ్, సాయి శిల్ప, దామినిలు పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను నిర్వాహకులు జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. మొత్తానికి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలు అమెరికాలోని తెలుగు ప్రజలకు మరిచిపోలేని విధంగా… పూర్తి ఆహ్లాదభరితంగా జరిగాయి.

నిర్వహణ సూపర్…

అమెరికాలో భారీ ఎత్తున ప్రజలను ఒక్కచోట మూడు రోజుల పాటు చేర్చడం, తెలుగు కళాకారులను తీసుకురావడం, వారికి ఆతిథ్యం కల్పించడం మామూలు విషయం కాదు. ఎక్కడా ఏ లోటు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ముందు నుంచే నిర్వహకులు పక్కా ప్రణాళికను రచించారు. పనులను విభజించి ఒక్కో పనికి ప్రత్యేకంగా కమిటీలను వేసుకున్నారు. ఇలా వీరి ప్రణాళికే వేడుకలను విజయవంతంగా సాగేలా చేసింది. మూడురోజుల వేడుకలకు హాజరైన అతిథులు, ఆహుతులు నిర్వాహకులను అభినందించారు. వేడుకల నిర్వాహణ కోసం పనిచేసిన కమిటీలు ఇవే…

1. అతిథులను స్వాగతించిన బృందం – మాధవి సుంకిరెడ్డి, రూప కన్నయ్యగారి

2. లైవ్ స్ట్రీమింగ్, మీడియా టీం – రామ్ అన్నాడి, వంశీ వుప్పలడాడియం

3. సుందరమైన వేదికను సిద్ధం చేసిన డెకరేషన్ టీం – నీలోహిత కొత్త, వనిత మందాడి

4. రిజిస్ట్రేషన్ బాధ్యతలు – సుధాకర్ కలసాని, వెంకట్ నర్పల

5. నోరూరించే వంటకాలు అందించిన ఫుడ్ కమిటీ – పవన్ గంగాధర, రమణ లష్కర్

6. కల్చరల్ టీం – సమీర ఇల్లెందుల, మహేందర్ గణపురం

7. బాంకెట్ నిర్వహణ – మంజూ ముప్పిడి, శాంతి నూతి

8. ప్రోగ్రాం షెడ్యూల్ – సునీత త్రిపురారం

9. వుమెన్ ఫోరం – మాదవి లోకిరెడ్డి, శ్రీలక్ష్మీ మందిగ

10. ఆధ్యాత్మక బృందం – శ్రీకాంత్ కొండా, శ్రీరాం వేదుల

11. హాస్పిటాలిటీ టీం – అశోక్ కొండల, దీప్తి సూర్యదేవర

12. వేదిక సమన్వయకర్తలు – కరణ్ పోరెడ్డి, దీప్తి సూర్యదేవర

13. చిత్ర ప్రదర్శన – మధుమతి వ్యాసరాజు, జ్యోత్స్న ఉండవల్లి

14. ఆడియో, వీడియో బృందం – కృష్ణ కోరాడ, భాస్కర్ గండికోట

15. వెండర్ బూత్స్ – రత్న జువ్వాడి, అశోక్ పొద్దుటూరి

16. సెక్యూరిటీ టీం – శశికాంత్ కనపర్తి, శ్రీనివాస్ తుల

17. సాహిత్య బృందం – రమణ జువ్వాడి, శారద సింగిరెడ్డి

18. వెబ్ సైట్ నిర్వహణ – శరత్ పున్రెడ్డి, రవికాంత్ మామిడి

19. పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ – వేణు భాగ్యనగర్, నిశాంత్ సిరికొండ

20. యూత్ కమిటీ – జ్యోతి వనం, జోయ్ ఏసిరెడ్డి

21. సావెనీర్ టీం – శ్రీనివాస్ గూడూరు, కవిత కడారి

22. వాలంటీర్ టీం – అశ్వినీ అయంచ, ఉదయ్ నిడిగంటి

23. పానెల్ డిస్కషన్ నిర్వహణ – తిరుమల్ నెల్లుట్ల, విజయ్

24. బిజినెస్ సెమినార్ల నిర్వహణ – వినోద్ బోయపాటి, రవి

25. రాజకీయ ఫోరం – రాం కాసర్ల, రమణ

26. ఆలుమ్నీ కమిటీ – సుబ్రమణ్యం జొన్నలగడ్డ, శేఖర్ బ్రహ్మదేవర

27. మ్యాట్రిమోనీ – ప్రసన్న డొంగూర్, లక్ష్మీ పాలేటి

28. ఓవర్సీస్ కోఆర్డినేషన్ – సురేశ్ పాతనేని, వెంకట్

జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ – శ్రీనివాస్ పిన్నపురెడ్డి(ఛైర్మన్, జేఏసీ), డా.పైళ్ల మల్లారెడ్డి(కో-ఛైర్మన్, జేఏసీ), హన్మంత్ రెడ్డి, డా.సంధ్య గవ్వా, డా.హరనాథ్ పొలిచర్ల, డా.విజయపాల్ రెడ్డి

జాయింట్ ఎగ్జక్యూటీవ్ కమిటీ – డా.హరనాథ్ పొలిచర్ల(ఛైర్మన్, జేఈసీ), డా.కరుణాకర్ అసిరెడ్డి(కో-ఛైర్మన్, జేఈసీ), అజయ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, భరత్ మాదాడి, ధీరజ్ ఆకుల, జ్యోతిరెడ్డి, కిరణ్ పాశం, మహేశ్ అదిభట్ల(కార్యదర్శి, ఏటీసీ), మోహన్ పట్లోల్ల, రఘువీర్ బండారు, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ ఏనుగు, విక్రం జంగం.

 

For those who missed ATC Full Length Videos – More Videos coming soon.
American Telugu Convention 2018 LIVE | DAY 1 | ATC | Dallas, Texas
 
Morning Session – American Telugu Convention 2018 LIVE | DAY 2 | ATC | Dallas, Texas
 
 
Evening Session – American Telugu Convention 2018 LIVE | DAY 2 | ATC | Dallas, Texas
 
Morning / Noon Session – American Telugu Convention 2018 LIVE | DAY 3 | ATC | Dallas, Texas
 
Day 3 Grand Finale – LIVE American Telugu Convention 2018 | ATC | Dallas, Texas

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*