వైసీపీలో డామినేటెడ్ పాలిటిక్స్ స్టార్టయ్యాయా‌..!

నెల్లూరు వైసీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌లేవ‌నుందా? ఇక్క‌డ మ‌ళ్లీ నువ్వా-నేనా అనేలా పార్టీలో పోరు ప్రారంభం కానుందా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో సుదీర్థ‌కాలం రాజ‌కీయా లు చేసిన ఆనం ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలోకి చేరుతోంది. నేడు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చు కోను న్నారు. అయితే, ఇక్క‌డే అస‌లు చిక్కు తెర‌మీదికి వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నెల్లూరులో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వ‌ర్గం ఆధిప‌త్యం చ‌లాయిస్తూ వ‌స్తోంది. అయితే, ఇప్పుడు ఆనం ఎంట్రీ ఇక్క‌డే క‌ల‌వ‌రం రేపుతోంది. ఆనంకు మేక పాటికి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఆది నుంచి కొన‌సాగుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ఇరు రాజ‌కీయ ప‌క్షాల మ‌ధ్య ఆధిప‌త్యం కొన‌సాగుతోంది.

రెండు కుటుంబాలు…..

అయితే, కాంగ్రెస్‌లో ఉండ‌గా ఆనం వ‌ర్గానిదే పైచేయిగా ఉండేది. ఈ రెండు కుటుంబాల‌కు చెందిన వారు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారే. అయితే ఆనం ఫ్యామిలీ వైఎస్‌కు అతి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం, ఇటు మేక‌పాటి గ‌తంలో నెల్లూరు ఎంపీ సీటు జ‌న‌ర‌ల్‌గా ఉన్న‌ప్పుడు ఒంగోలు, న‌ర‌సారావుపేట నుంచి ఎంపీగా గెల‌వ‌డంతో జిల్లాలో వాళ్ల‌కు అంత ప‌ట్టు చిక్కేది కాదు. మ‌రో వైపు ఆనం సోద‌రులు ఇద్ద‌రూ ఎమ్మెల్యేలుగా గెల‌వ‌డంతో జిల్లాలో ఎంత‌మంది బ‌డా నాయ‌కులు ఉన్నా ఆనం చెప్పిన‌ట్టే జ‌రిగేది. ఇక వైఎస్ మ‌ర‌ణాంత‌రం ముందుగా వైసీపీలోకి మేక‌పాటి బ్ర‌ద‌ర్స్ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు వారిద్ద‌రు త‌మ ప‌ద‌వుల‌కు సైతం రాజీనామాలు చేయ‌డంతో వాళ్లు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాగే జిల్లా వైసీపీలో మేక‌పాటి హ‌వా స్టార్ట్ అయ్యింది. ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఆనం వ‌ర్గం బ‌య‌ట‌కు రావ‌డంతో ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆనం వ‌ర్గానికి ఉన్న ప‌ట్టు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయి మేక పాటి వ‌ర్గానికి జోరు పెరిగింది.

విధిలేని పరిస్థితుల్లోనే…..

ఇక‌, ఇప్పుడు ఆనం మ‌ళ్లీ వైసీపీలోకి వ‌స్తుండ‌డం ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మేక‌పాటి వ‌ర్గానికి చెక్ ప‌డుతుందేమోన‌ని ఆ వ‌ర్గం త‌ల్ల‌డిల్లుతోంది. వాస్త‌వానికి ఆనం వైసీపీ ఎంట్రీ అనేది విధిలేని ప‌రిస్థితిలోనే సాగుతోంది. మొద‌ట్లో జ‌గ‌న్‌ను తీవ్ర‌స్థాయిలో దూషించిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి.. త‌ర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జిల్లాలో ఎదగాల‌ని భావించినా.. టీడీపీలో బ‌లంగా ఉన్న సోమి రెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆనంను ఎద‌గ‌నివ్వ‌లేదు. దీంతో పార్టీలో చేరే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన అనేక హామీలు ఆనం విష‌యంలో అమలు కాకుండా పోయాయి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాలో తిరుగులేని విధంగా చ‌క్రం తిప్పిన ఆనం బ్ర‌ద‌ర్స్ విష‌యంలో వివేక మృతి చెందాక రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఒంట‌ర‌య్యాడు. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఆత్మకూరు ప‌గ్గాలు ఇచ్చినా నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న మాట చెల్లుబాటు కాకుండా పోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

మేకపాటి ఊరుకుంటారా?

దీనికి తెర‌వెనుక సోమిరెడ్డి తిప్పిన చ‌క్ర‌మేన‌ని ఆనం గ్ర‌హించారు. దీంతో అలిగిన ఆనం.. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా వైసీపీతో చ‌ర్చ‌లు జ‌రిపి పార్టీ తీర్థం పుచ్చుకు నేందుకు రెడీ అయ్యారు. అయితే, టీడీపీలో సోమిరెడ్డి సెగ పెట్ట‌డంతో వైసీపీలోకి వ‌చ్చిన ఆనం..కు ఇక్క‌డ మేక‌పాటి వ‌ర్గం సెగ పెడుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆనం ఆది నుంచి కూడా ఆత్మ‌కూరు టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. త‌న‌కు కంచుకోట‌గా ఉన్న ఆత్మ‌కూరు నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, ఇక్క‌డ మేక‌పాటి వ‌ర్గం బ‌లంగా వేళ్లూనుకుంది. మేక‌పాటి గౌతం రెడ్డి ఇక్క‌డ నుంచిగెలుపొందారు. దీంతో ఆనంకు వెంక‌ట‌గిరి టికెట్ ద‌క్కేలా క‌నిపిస్తోంది. అయితే నేదురుమిల్లి జ‌నార్థ‌న్‌రెడ్డి వార‌సుడు కూడా వైసీపీలో చేర‌డంతో ఆనంకు ఆ సీటు అయినా వ‌స్తుందా ? అన్న‌ది గ్యారెంటీ లేదు. ఇక మేక‌పాటి ఫ్యామిలీతో ఎలాగూ పొస‌గ‌దు. దీంతో వైసీపీలో ఆనంవ‌ర్సెస్ మేక‌పాటి అనే రేంజ్‌లో రాజ‌కీయాలు న‌డుస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*