బ్రేకింగ్ : ఆనం ఇకలేరు….!

సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి కన్ను మూశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆనం కొద్దిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం వివేకానందను ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆనం వివేకానందరెడ్డి వయస్సు 67 సంవత్సరాలు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఆనం వివేకా తన సోదరుడి కోసం గతంలో మంత్రి పదవులనూ వదిలేశారు. ఆనం వివేకాది ప్రత్యేక స్టయిల్. ఆయన మృతితో నెల్లూరులో ఆనం అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనం వివేకాకు ఇద్దరు కుమారులున్నారు. ఆరు నెలల క్రితం వరకూ ఆయన పలు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. టీడీపీ లోచేరిన ఆనం వివేకానంద  రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు అంటే ముందు గుర్తొచ్చేది ఆనం సోదరులే. ఆనం వివేకా సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి. ఆనం వివేకా మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు బోరున విలపిస్తున్నారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆనం వివేకా ఎన్నికయ్యారు. ఆనం వివేకా అంత్యక్రియలను రేపు నెల్లూరు లో నిర్వహించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1