ఆ ఎంపీలిద్దరికీ మైనస్…?

bode prasad telugudesamparty

పార్లమెంట్ సమావేశాల వైపు తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న తరుణం. తెలంగాణ ఎంపీలు ఒకే. హిందీ, ఆంగ్ల భాషల్లో సభను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎపి టిడిపి ఎంపీలు బాష సమస్య తో సభలో ఆసక్తికర ప్రసంగాలు చేయ లేక పోతున్నారు. అవిశ్వాసం పై హిందీలో అద్భుతంగా మాట్లాడారని టిడిపి ఎంపీలు రామ్మోహన నాయుడు కి, ఆంగ్లంలో బాగానే చెప్పారని గల్లా జయదేవ్ కి ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. సభలో ఎంపిలు కేశినేని నాని కి, బుట్ట రేణుక కు మైనస్ మార్కులు వేశారు ఎపి వాసులు. హిందీ, ఆంగ్ల భాషలపై పట్టులేనప్పుడు చక్కగా తెలుగులోనే మాట్లాడితే తెలుగు రాష్ట్రాల్లో మరింత మైలేజ్ వచ్చేదన్న అభిప్రాయం సర్వాత్రా వ్యక్తమైంది.

పంథా మార్చిన టిడిపి ….

రాజ్యసభలో స్వల్ప కాలిక చర్చపై సీఎం రమేష్ చక్కగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. అదే ధోరణిలో టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత కాకినాడ ఎంపీ తోట నరసింహం సైతం లోక్ సభలో చక్కగా ప్రజెంట్ చేశారు. ఇదే తీరులో మొన్నటి అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో నాని కూడా తెలుగులో మాట్లాడి ఉంటే అద్భుతంగా ప్రసంగించి వుండేవారంటున్నారు నెటిజెన్స్. వాస్తవానికి ఏ భాషలో పార్లమెంట్ లో ఎంపిలు మాట్లాడినా ట్రాన్స్ లెట్ బటన్ నొక్కితే వారి మాటలు తర్జుమా అయ్యే సౌకర్యం వుంది. గతంలో రోశయ్య వంటివారు నందమూరి హరికృష్ణ తెలుగు భాషలోనే మాట్లాడి శభాష్ అనిపించుకున్నారు. పలు రాష్ట్రాల ఎంపీలు సైతం తమ మాతృ భాషలోనే మాట్లాడేందుకు ఇష్ట పడతారు. తద్వారా తమ ప్రాంతంలోని ప్రజలకు తమ ఎంపి చెప్పిన అంశాలు చక్కగా బోధ పడతాయి. ఇప్పటికైనా ఈ సత్యాన్ని టిడిపి ఎంపిలు గుర్తించి మాతృబాష బాట పట్టడం ముదావహం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*