ఏపీలో 6న‌ ఏం జ‌ర‌గుతుంది..?

ఏపీలో స‌రికొత్త రాజకీయ ప‌రిణామం చోటు చేసుకుంది. లోక్‌స‌భ స‌మావేశాలు ఈనెల 5న ముగుస్తున్నాయి. మ‌రి ఏపీలో 6న ఏం జ‌రుగుతుంది..? టీడీపీ, వైసీపీలు, జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు ఏం చేయ‌బోతున్నాయి..? ప‌్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అన్నిపార్టీల కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతోంది..? ఇప్పుడీ ప్ర‌శ్న‌లు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సీపీఎం నేత మ‌ధు, సీపీఐ నేత రామ‌కృష్ణ త‌దిత‌రుల కీల‌క భేటి ముగిసింది. ఈ మూడు పార్టీలు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాయి. మొట్ట‌మొద‌టిసారిగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న కార్యాచ‌ర‌ణ‌లో భాగ‌స్వామ్యం అవుతున్నారు.

వామపక్షాలతో ఉద్యమించేందుకు…..

ఇప్ప‌టివ‌ర‌కు అయోమ‌యంలో ఉన్న ఆయ‌న వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ఉద్య‌మించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ స‌మావేశంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏం చేశారో వామ‌ప‌క్ష నేత‌లు వివ‌రించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌తోనే ప్ర‌త్యేక హోదా విష‌యంలో దేశంలో చ‌ర్చ మొద‌లైంద‌నీ, టీడీపీ, వైసీపీలు ముందుకు అడుగు వేశాయ‌నీ చెప్పుకొచ్చారు. అదే స‌య‌మంలో ఫిబ్ర‌వ‌రిలో తాము రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వ‌డంతోనే ప్ర‌త్యేక హోదాపై అధికార టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో క‌ద‌లిక వ‌స్తుంద‌నీ వామ‌ప‌క్ష నేత‌లు మధు, రామ‌క‌ష్ణ పేర్కొన్నారు.

బీజేపీపై మండిపడ్డ…..

వాస్తవానికి ఈ స‌మావేశం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కు క‌లిసివ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో తాను బీజేపీ మ‌నిషిని కాద‌నీ ప‌రోక్షంగా ఏపీ ప్ర‌జ‌లకు, టీడీపీ, వైసీపీ నేత‌ల‌కు చెప్పారు. ప‌వ‌న్ ఇప్ప‌టికే బీజేపీ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్నాడ‌ని… ప‌వ‌న్‌ను బీజేపీ డైరెక్ష‌న్ చేస్తోంద‌ని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

మరో వైపు టీడీపీ, వైసీపీ….

కేంద్ర ప్ర‌భుత్వంపై నిర‌స‌న‌గా ఈనెల 6న విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, వామ‌ప‌క్ష నేత‌లు ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఈనెల 6న టీడీపీ, వైసీపీలు ఏం చేయ‌బోతున్నాయ‌న్న‌దే ఆస‌క్తిగా మారింది. తాము ఈనెల 6న రాజీనామాలు చేస్తామ‌ని ఇప్ప‌టికే వైసీపీ ఎంపీలు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కైతే లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రుగులేదు. చివ‌రిరోజు కూడా చ‌ర్చ జ‌ర‌గ‌కుంటే మాత్రం 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌ర‌ణ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక అధికార టీడీపీ ఏం చేయ‌బోతుందో చెప్ప‌డం లేదు. నిజంగానే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలిమ‌రి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*