ముత్తంశెట్టికి ముచ్చెమటలు పడుతున్నాయా..??

avanthisirnivasarao-ysrcongressparty

ఆయన అయిదేళ్ళ క్రితం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన ముత్తంశెట్టి రెండేళ్ళు తిరగకుండా కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా నిలిచి గెలిచారు. ఐతే భీమిలీ మీద ఆయనకు మోజు పోలెదు. దాంతో ఆయన పార్టీ మారి మరీ 2019 ఎన్నికలకు భీమిలీని కార్యక్షేత్రం చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ భీమిలీ వైసీపీలో ఆయనకు అన్నీ కలసి వస్తున్నాయా అన్నది ఇక్కడ చూడాలి. నిజానికి వైసీపీలో ముత్తంశెట్టి ఇపుడు కొత్త పూజారి, ఆయనకంటూ పాత క్యాడర్ ఎంతో కొంత ఉన్నా పూర్తిగా భీమిలీలో వైసీపీ క్యాడర్ పూర్తిగా స‌హకరిస్తేనే ఆయన గెలుపు అందుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే సీన్ తేడా కొడుతోంది.

ఆ వర్గం డుమ్మా…..

హైదరాబాద్ లో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న తరువాత భీమిలీకి వచ్చిన ముత్తంశెట్టికి పార్టీలో బలమైన ప్రధాన వర్గం షాక్ ఇచ్చేసింది. నిన్నటి వరకూ పార్టీ ఇంచార్జిగా ఉన్న అక్రమాని విజయనిర్మల, ఆమె భర్త సీనియర్ నేత అక్రమాని రామునాయుడు సహా కీలకమైన నేతలంతా ముత్తంశెట్టి కార్కక్రమానికి గైరు హాజరు కావడం కలవరపరచే అంశమే. పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి అక్కడ స్పష్టంగా కనిపించింది. ముత్తంశెట్టి ఇపుడు అక్కడ మొదటి నుంచి మొదలుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అటువైపు చూస్తే మంత్రి గంటా శ్రీనివాసరావు పవర్ ఫుల్ క్యాండిడేట్. మరి ముత్తంశెట్టి ఎలా నరుక్కొస్తారో చూడాలి.

బలమైన సామాజికవర్గం…..

ముత్తంశెట్టిని పార్టీలోకి తెచ్చిన వైసీపీ అధినాయకత్వం భీమిలీలో ఉన్న కీలకమైన మరో వర్గాన్ని సర్దుబాటు చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది. నిన్నటి వరకూ పార్టీకి కొమ్ము కాసి జనంలోకి తీసుకువెళ్ళిన ఇంచార్జి విజయనిర్మల, ఆమె వర్గాన్ని కలుపుకుని పోవాల్సింది. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఇపుడు సహాయ నిరాకరణ చేస్తే ముత్తంశెట్టికి గండమే. అదే సమయంలో వారంతా రేపో మాపో టీడీపీలో చేరుతారని అంటున్నారు. అదే కనుక జరిగితే తనకు బలముందని, సెంటిమెంట్ సీట్ అని పార్టీ మారీ మరీ తీసుకున్న భీమిలీ సీటే ముత్తంశెట్టికి ముచ్చెమటలు పుట్టించడం ఖాయమని అంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 15976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*