బాల‌య్య పొలిటిక‌ల్ మిష‌న్ బాధ్య‌తలు బోయ‌పాటికి?

2014 ఎన్నిక‌లకి ముందే బాల‌కృష్ణ `లెజెండ్` చేశాడు. రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన ఆ చిత్రం ఎన్నిక‌ల్ని దృష్టిలో ఉంచుకొనే చేశాన‌ని స్వ‌యంగా ప‌లుమార్లు చెప్పుకొచ్చాడు బాల‌య్య‌. తాము అనుకొన్న‌ట్టుగా ఆ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసి, రాజకీయం ప‌రంగా అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని చైత‌న్యవంతం చేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తూ వ‌చ్చారు. అందులో పొలిటికల్ పంచులు, సెట్టైర్లు కూడా ఆ రేంజిలో ఉంటాయి. అయితే అదే త‌ర‌హా బాధ్య‌త‌ల్నే ఈసారి కూడా బోయ‌పాటికి అప్ప‌జెప్ప‌బోతున్నార‌ట బాల‌య్య‌. ఇక ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా యేడాది స‌మ‌యం ఉంద‌న్న విష‌యం తెలిసిందే. మ‌రోసారి `లెజెండ్` త‌ర‌హా రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన క‌థ‌ని సిద్ధం చేసి ఎన్నిక‌ల‌కు ముందుగా విడుద‌ల‌య్యేలా చేద్దామ‌ని బోయపాటికి చెప్పాడ‌ట. దాంతో ఆ మిష‌న్ బాధ్య‌త‌ల్ని బోయ‌పాటి ఇప్ప‌టికే స్వీక‌రించి క‌థ‌ని సిద్ధం చేసే ప‌నిలో ప‌డిపోయిన‌ట్టు స‌మాచారం.

నిజానికి బాల‌కృష్ణ 101వ చిత్రాన్నే తాను చేయాల‌నుకొన్నాడు బోయ‌పాటి. కానీ ఇద్ద‌రి చేతుల్లో ఉన్న ప్రాజెక్టుల‌వల్ల అది కుద‌ర్లేదు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తున్నాడు బోయ‌పాటి. బాల‌కృష్ణ కూడా ఎన్టీఆర్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఎలాగో ఎన్టీఆర్ సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల‌కి నాలుగైదు నెల‌ల స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి ఆలోపు పొలిటిక‌ల్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌చ్చ‌నేది బాల‌య్య ప్లానింగ్‌. బోయ‌పాటి కూడా రామ్‌చ‌ర‌ణ్‌తో చేస్తున్న చిత్రం పూర్త‌యిన వెంట‌నే బాల‌కృష్ణ‌తో సినిమా చేయాల‌ని ఇదివ‌ర‌కే నిర్ణ‌యించుకున్నాడు. తాజాగా బాల‌కృష్ణే క‌బురు పెట్ట‌డంతో క‌థ‌లో కొన్ని మార్పులు చేసి పొలిటిక‌ల్ మిష‌న్‌గా ఓ సినిమాని చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో సింహా, లెజెండ్ త‌ర్వాత వ‌స్తున్న చిత్ర‌మిది. మ‌రి ఈసారి ఏ రేంజులో సినిమాలో పంచులు పేల‌బోతున్నాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*