బాల‌య్య ఫ్రెండ్‌ ను చంద్రబాబు వదిలేస్తారా..?

ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. అధికార పార్టీ నాయ‌కులు, సిట్టింగులు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. సిట్టింగులు త‌మ స్థానాల‌ను ప‌దిలం చేసుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. తిరిగి త‌మ‌కే టికెట్ ఇచ్చేలా.. వారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం వారికి తాను జ‌రిపించిన స‌ర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా టికెట్ ఇవ్వాలా? వ‌ద్దా? అని నిర్ణ‌యించుకుం టున్నారు. దీంతో సిట్టింగు ఎమ్మెల్యేల‌లో తీవ్ర టెన్ష‌న్ పెరిగిపోతోంది. ఒక‌ప‌క్క ఎండ‌ల‌తో ఉక్క‌బోత‌తోపాటు.. టికెట్ టెన్ష‌న్ వీరికి మ‌రింత ఉక్క‌పోతకు గురి చేస్తోంది. ఎవ‌రికివారు త‌మ‌కు టికెట్ వ‌స్తుందా? లేదా? అని మ‌థ‌న ప‌డుతున్నారు. వీరిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావు!

గత ఎన్నికల్లో…..

ఈయ‌న గ‌త కొన్నాళ్లుగా త‌న‌లో తానే స‌త‌మ‌తం అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయ‌ని స‌మాచారం అంద‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకొస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి అన్ని పార్టీల‌కూ కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. జిల్లాలో ఒకింత పెద్ద నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కాదు. 2014లో ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌ఫున క‌దిరి బాబూరావు ద‌క్కించుకున్నారు. వైసీపీ త‌ర‌ఫున బుర్రా మ‌ధుసూద‌న‌రావు పోటీ చేశారు. అమీ తుమీగా సాగిన ఈ పోరులో క‌దిరి బాబూరావు అత్య‌ధిక మెజార్టీ సాధించి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందారు. 1999, 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి తిరుప‌తి నాయుడు వ‌రుస విజ‌యం సాధించారు.

కాంగ్రెస్ కు గతంలో…..

2009లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉగ్ర‌న‌ర‌సింహా రెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, 2014లో మాత్రం ఇక్క‌డ అప్ప‌టి విభ‌జ‌న స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు టీడీపీ నుంచి పోటీ చేసిన బాబూరావుకు అవ‌కాశం ఇచ్చారు. బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన క‌దిరికి బాల‌య్య ప‌ట్టుబ‌ట్టి మ‌రీ 2009లో టిక్కెట్ ఇప్పించారు. అయితే ఆయ‌న నామినేష‌న్ ప‌త్రంలో నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో ఆయ‌న నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యి చివ‌ర‌కు 2009 ఎన్నిక‌ల్లో క‌నిగిరిలో టీడీపీకి అభ్య‌ర్థి లేకుండా పోవ‌డంతో అక్క‌డ టీడీపీ చివ‌ర‌కు ఓ ఇండిపెండెంట్‌కు మ‌ద్ద‌తు ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

సానుభూతి పవనాలు….

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆ సానుభూతి ప‌వ‌నాలు కూడా క‌లిసి రావ‌డంతో ఆయ‌న ఎమ్మెల్యేగా తొలిసారి విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా బాబురావు నాలుగేళ్ల పాల‌న చూస్తే ఈయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించ‌డంలోను, కాంగ్రెస్ ఆన‌వాళ్ల‌ను చెరిపి వేసి, టీడీపీ దిశ‌గా ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లించ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యార‌ని అధినేత చంద్ర‌బాబుకు నివేదిక‌లు అందాయి. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న త‌న‌దైన దూకుడు శైలితో ముందుకు వెళ్ల‌డం, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాన‌ని చెబుతున్నా.. వారి స‌మ‌స్య‌ల‌పై పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం ప్ర‌ధాన మైన‌స్‌లుగా క‌నిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, 2009లో కాంగ్రెస్ నుంచి విజ‌యం సాధించిన ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువ అవుతున్నారు.

ఎమ్మెల్యే కాకున్నా…..

ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నారు. నిజానికి ఈయ‌న ఎమ్మెల్యే కాక‌పోయినా.. ప్ర‌జ‌లు ముందుగా ఈయ‌న వ‌ద్ద‌కే వెళ్తున్నారంటే ఈయ‌న హ‌వా ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తుంది. దీనిపై కూడా చంద్ర‌బాబుకు నివేదిక‌లు అందాయి. పార్టీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసిన బాబురావు అటు అధికారుల మీద కూడా ప‌ట్టు సాధించ‌లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డిని టీడీపీలోకి తీసుకువ‌చ్చి.. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డం ద్వారా ఈ సీటును కోల్పోకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే, ఇక్క‌డి ఓటింగ్‌ను ప్ర‌భావితం చేస్తార‌ని భావిస్తున్న జెడ్పీ మాజీ చైర్మ‌న్ ముక్కు కాశిరెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకువ‌చ్చి.. గెలుపు గుర్రం ఎక్కాల‌ని అధినేత చంద్ర‌బాబు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా ఇదే వ‌ర్క‌వుట్ అయితే మాత్రం.. క‌దిరి బాబూరావుకు చంద్ర‌బాబు ఉత్త చేతులు చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీ మాత్రం…….

వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మ‌ధుసూద‌న్‌రావుకే మ‌రోసారి టిక్కెట్ రావొచ్చ‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన యాద‌వుల ఓట్లు భారీ స్థాయిలో ఉండ‌డంతో జిల్లాలో బీసీల‌కు ఓ సీటు ఇవ్వాల్సి ఉన్న నేప‌థ్యంలో క‌నిగిరిలో మ‌ళ్లీ మ‌ధుసూద‌నే రంగంలోకి దింపాల‌ని వైసీపీ అధిష్టానం దాదాపు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఇటు వైపు నాలుగేళ్లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబూరావు తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కోవ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించి ఆ ప్లేస్‌లో మ‌రో బ‌ల‌మైన వ్య‌క్తుల‌ను రంగంలోకి దింపాల‌ని బాబు దాదాపు డెసిష‌న్ తీసుకున్న‌ట్టే అన్న టాక్ టీడీపీ వ‌ర్గాల్లో కూడా వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*