పందెం నీదా…నాదా….??

betting in kodangal and kukatpally

ఎన్నికలంటే పందెం రాయుళ్ళకు పండగే. సంక్రాంతి కి కోడి పందేలు ఏవిధంగా సాగుతాయో అదే స్థాయిలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పందెం రాయుళ్ళు వాటిపై వాలిపోతారు. వేలకోట్ల రూపాయలు పందేలు గ్రామాలనుంచి, పట్టణాలు, నగరాల వరకు నడుస్తుంది. తాజాగా జరుగుతున్న ఎన్నికలు పందెం రాయుళ్ళకు కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పందేలు మామూలు స్థాయిలో లేవు.

ఎవరు విజేత …?

పందెం రాయుళ్ళు పందెం కాసేటప్పుడు సర్వే నివేదికలపై ఆధారపడతారు. ఇందులో లగడపాటి రాజగోపాల్ నిర్వహించే సర్వే ను పంటర్స్ ఎక్కువ మంది నమ్ముతారు. ప్రీపోల్ సర్వే , పోల్ తరువాత వచ్చే సర్వే లను నమ్ముకుని పందాలు కాస్తారు. ఈసారి ఎన్నికల్లో ముందుగానే పందాలు భారీ స్థాయిలో మొదలు అయ్యాయి. ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై కన్నా ఏ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి విజేత కానున్నారనే అంశంపై ఎక్కువ పందాలు నడుస్తున్నాయి. ఇక మెజారిటీ పై కూడా ఎక్కువ మంది పందాలు కడుతున్నారు. అదే విధంగా బాగా ప్రాచుర్యం వున్న నాయకుల గెలుపు పై కూడా బాగా పందేలు వేస్తున్నారు.

పందెం రాయుళ్ళు కేరాఫ్ హైదరాబాద్ …

పందెం రాయుళ్లంతా నెలరోజులుగా భాగ్యనగర్ కేంద్రంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తూ రేటింగ్స్ మారుస్తున్నారు. పోలింగ్ కి ముందు ఇప్పటివరకు బెట్టింగ్స్ జోరుగా సాగితే పోలింగ్ జరుగుతుండగా గంట గంటకు రేటింగ్స్ మారుస్తూ పంటర్స్ లో టెన్షన్ పెంచుతున్నారు. ప్రధానంగా కూకట్ పల్లి, కొండగల్ నియోజకవర్గాలపై ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు ఈ రెండు నియోజకవర్గాలపై బెట్టింగ్ లు కట్టినట్లు చెబుతున్నారు. ఏపీకి చెందిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లోని ప్రముఖ పందెం రాయుళ్ళు అంతా తెలంగాణ గడ్డపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*