భూమా ఫ్యామిలీలో బాబు ఎర్త్ ఎవ‌రికి..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో భూమి ఫ్యామిలీ ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ఉంటుంది ? అన్న ఆస‌క్తి క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లోనే కాకుండా అటు స్టేట్ పాలిటిక్స్‌లోనూ ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి భూమా ఫ్యామిలీలో ఏకంగా ముగ్గురు పోటీ చేశారు. నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి, ఆళ్లగ‌డ్డ నుంచి శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. ఇక క‌ర్నూలులో భూమా బావ‌మ‌రిది ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి పోటీ చేశారు. వీళ్లు ముగ్గురు గెలిచారు. అయితే ఎన్నిక‌ల‌కు ముందే శోభ రోడ్డు ప్రమాదంలో మృతి చెంద‌డంతో ఆమె మరణించి గెలిచిన ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత భూమా ఫ్యామిలీ వైసీపీకి టాటా చెప్పేసి టీడీపీలోకి జంప్ చేసేసింది. ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఎన్నిక ఏకగ్రీవమయింది.

ఏవీ ప్రయత్నాలన్నీ…..

ఇక తాజా ప‌రిణామాలు చూస్తే ఆళ్లగ‌డ్డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌పై ఇప్పటికే తీవ్ర వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. శోభ ఆక‌స్మిక మృతితో అక్కడ ఏక‌గ్రీవంగా గెలిచిన భూమా కుమార్తె అఖిల ప్రియ చిన్న వ‌య‌స్సులోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిస్థితుల్లో భూమా కుటుంబం టీడీపీలోకి చేరిపోయింది. ఆ త‌ర్వాత భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మర‌ణం.. ఆయ‌న కుమార్తె, ఆళ్లగ‌డ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ మంత్రిగా ప‌ద‌వి అలంక‌రించ‌డం వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఇలా ఉండే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. దీనికి ప్రధాన కార‌ణం.. భూమా అనుచ‌రుడు, రైట్ హ్యాండ్ ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేయ‌డ‌మే!

నంద్యాలపైనే కన్ను…..

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని గ‌తంలోనే ఏవీ అనుకున్నారు. అయితే, నాగిరెడ్డి ప్రమేయంతో వెన‌క్కి త‌గ్గిన ఆయ‌న త‌ర్వాత గ‌త ఏడాది భూమా మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల సీటు ఆశించారు. అయితే ఈ విష‌యంలో చంద్రబాబు ఆచితూచి వ్యవ‌హ‌రించ‌డం, త‌న తండ్రి మ‌ర‌ణంతో ఆయ‌న‌కు రైట్ హ్యండ్‌గా ఉన్నప్పటికీ.. ఏవీ సుబ్బారెడ్డిని అఖిల ప్రియ ప‌క్కన పెట్టడం వంటి ప‌రిణామాల‌తో ఏవీకి అఖిలకు మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గు మ‌నే ప‌రిస్థితి ఏర్పడింది. ఇటీవ‌ల కాలంలో వీరిద్దరి మ‌ధ్య తీవ్ర వివాదాలు చోటుచేసు కుంటున్నాయి. బ‌హిరంగంగా విమ‌ర్శించుకుంటున్నారు. కేవ‌లం ఆళ్లగ‌డ్డ టికెట్ కోస‌మే ఈ వివాదాలు జ‌రుగుతున్నాయ‌ని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏవీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సుబ్బారెడ్డి మ‌రో అడుగు ముందుకు వేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్లగ‌డ్డ నుంచి పోటీ చేస్తాన‌ని మ‌రీ చెప్పారు.

అఖిలప్రియకు గ్యారంటీ…..

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఆళ్లగ‌డ్డ నుంచి ప్రస్తుతం మంత్రి అఖిల ప్రియ ప్రాతినిధ్యం వ‌హిస్తోంది కాబ‌ట్టి.. ఆమెను తొల‌గించ‌కుండా ఏవీకి నంద్యాల‌లో చాన్స్ ఇస్తారా ? అన్నది స‌స్పెన్స్‌గా ఉంది. విశ్వసనీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన సానుభూతి అఖిల‌మీద ఎక్కువుగా ఉంది. దీంతో ఆమెను ఆళ్లగ‌డ్డలో కంటిన్యూ చేస్తార‌ని టాక్‌. అదే జ‌రిగితే నంద్యాల‌లో అప్పుడు సుబ్బారెడ్డి వ‌ర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానంద‌రెడ్డి మ‌ధ్య సీటు కోసం ఫైట్ స్టార్ట్ అవుతుంది.

కర్నూలులో ఎస్వీని…..

ఇక జిల్లా కేంద్రమైన క‌ర్నూలు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న భూమా బావ‌మ‌రిది ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంది. ఆయ‌న‌కు అక్కడ పోటీగా రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ.వెంక‌టేష్ త‌న‌యుడు టీజీ.భ‌ర‌త్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. మోహ‌న్‌రెడ్డికి ఈ సారి సీటు క‌ష్టమే అన్న టాక్ వ‌స్తోంది. ఏదేమైనా చంద్రబాబు ఈ సారి భూమా ఫ్యామిలీలో ఇద్దరికి ఎర్త్ పెడ‌తారా ? లేదా ? ఒక‌రిని త‌ప్పిస్తారా ? అన్నదే స‌స్పెన్స్‌. అయితే ముగ్గురిలో ఒక‌రు అయితే ప‌క్కాగా అవుట్. మ‌రి రెండో సీటు వాళ్లకు ద‌క్కితే ల‌క్ చిక్కిన‌ట్టే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*