బోళ్ల రంగంలోకి దిగేశాడే… !

ఏలూరు టీడీపీ ఎంపీ సీటు కోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నెల‌కొంది. ఇక్కడ టీడీపీ నుంచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుకు పోటీగా గ‌తంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేంద్రమంత్రిగా ప‌నిచేసిన దివంగ‌త మాజీ కేంద్రమంత్రి బోళ్ల బుల్లిరామ‌య్య మ‌న‌వ‌డు, యువ పారిశ్రామిక‌వేత్త బోళ్ల రాజీవ్ రంగంలోకి దిగాడు. గ‌త ఎన్నిక‌ల్లోనే రాజీవ్ బుల్లిరామ‌య్యతో పాటు బాబు ఫ్యామిలీతో త‌న‌కు ఉన్న ద‌గ్గరి బంధుత్వం నేప‌థ్యంలో ఏలూరు ఎంపీ సీటు కోసం ప్రయ‌త్నాలు చేశారు. అప్పుడు బాబు ఆయ‌న లెక్కల ప్రకారం మాగంటికే సీటు ఇచ్చారు.

చాపకింద నీరులా….

ఇక ఇప్పుడు వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మ‌ళ్లీ రాజీవ్ ఎంపీ సీటు కూడా చాప‌కింద నీరులా దూసుకు వెళుతున్నాడు. గ‌త కొద్ది నెల‌లుగా ఏలూరు లోక్‌స‌భ సెగ్మెంట్‌లోని టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు ప్రముఖ నాయ‌కుల‌తో మీట్ అవుతోన్న రాజీవ్ ఏలూరులో త‌న కార్యాల‌యాన్ని కూడా ఓపెన్ చేశారు. ముందుగా రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్లు అయిన చింత‌ల‌పూడి, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లోని వివిధ మండ‌లాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయ‌కుల‌తో మీట్ కార్యక్రమాల‌తో కార్యక‌ర్తల‌కు ద‌గ్గర‌వుతున్నారు.

ఎందుకంత ధీమా…..

అన్ని విధాలా ఈక్వేష‌న్లు క‌లిసి రావ‌డంతో రాజీవ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు పార్టీ అధిష్టానం త‌న‌కే ఇస్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. కార్యక‌ర్తల ప‌రిచ‌య స‌మావేశాల్లో రాజీవ్ ఇక నుంచి పార్టీ త‌ర‌పున నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాన‌ని.. ఏ సాయం అవ‌స‌ర‌మైనా తాను అండ‌గా ఉంటాన‌ని వారికి భ‌రోసా ఇస్తున్నారు. ఇక రాజీవ్ తాజాగా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో చింత‌ల‌పూడిలో జ‌రిగిన ఫెన్షన్ష పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీత‌ల సుజాత‌తో క‌లిసి నేరుగా పాల్గోవ‌డం కూడా రాజ‌కీయంగా ఆయ‌న ఎంపీ రేసులో ఉన్నార‌న్న విష‌యంలో చాలామందికి నేరుగానే క్లారిటీ వ‌చ్చేసింది.

పీతల సుజాత కూడా….

ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పీత‌ల సుజాత ప్రతిష్టాత్మకంగానే తీసుకోవ‌డంతో పాటు ఓ మోస్తరుగా జ‌న‌స‌మీక‌ర‌ణ కూడా జ‌రిగింది. రాజీవ్ నేరుగా ఓ ఎమ్మెల్యేలో కలిసి పాల్గొన్న తొలి కార్యక్రమంగా ఇది నిలిచింది. ఇక రాజీవ్ అటు కార్యక‌ర్తల‌కు ప‌రిచ‌యంతో ద‌గ్గర‌వ్వడంతో పాటు గ‌తంలో త‌న తాత బుల్లిరామ‌య్యతో స‌న్నిహితంగా ఉన్న వారిని క‌లుపుని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. బుల్లిరామ‌య్యతో రెండున్నర ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న నాయ‌కులు, వారి వార‌సులు ఇప్పుడు రాజీవ్‌తో క‌లుస్తున్నారు.

మాగంటి లెక్కేంటి…

ఇటు ఎంపీ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుతో పాటు రాజీవ్ కూడా రేసులో ఉన్నారు. రాజీవ్‌కు సీటు ఇస్తే మాగంటిని చంద్రబాబు వ‌దులుకోరు. ఆయ‌న‌కు మ‌రో ఆప్షన్ గ్యారెంటీగా చూపిస్తారు. రాజీవ్‌కు ఎంపీ సీటు ఇస్తే మాగంటికి ఏలూరు లోక్‌స‌భ సెగ్మెంట్ ప‌రిధిలోనే ఉన్న కృష్ణా జిల్లాలోని కైక‌లూరు అసెంబ్లీ సీటు ఇస్తార‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చలు న‌డుస్తున్నాయి. గ‌తంలో మాగంటి రాష్ట్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆయ‌న ఫ్యామిలీకి దెందులూరుతో పాటు కైక‌లూరులోనూ మంచి ప‌ట్టుంది. ఎవ‌రి లెక్క ఎలా ఫైన‌ల్‌గా ఏలూరు టీడీపీ ఎంపీ క్యాండెట్ విష‌యంలో చంద్రబాబు లెక్కలు ఎలా ఉంటాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*